సమంత కోసం ఒక టీమ్‌ దిగింది

సమంత కోసం ఒక టీమ్‌ దిగింది

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు పెట్టడానికి ఏ సెలబ్రిటీలు అయినా తమ చేతిలోని ఐఫోన్‌నే వాడుతుంటారు. కొన్ని సార్లు ప్రొఫెషనల్‌ ఫోటోగ్రాఫర్లని పెట్టుకుని ఫోటోలు దిగి పెడుతుంటారు. అయితే ఏదైనా ప్రైవేట్‌ ఈవెంట్‌కి వెళ్లినపుడు లేదా ఇంట్లోనే చక్కగా రెడీ అయినపుడు... చేతిలోని ఐఫోన్‌ మాత్రమే సరిపోదుగా అంటోంది సమంత.

అందుకే అలాంటి మూమెంట్స్‌ ఏమీ మిస్‌ అవకుండా, ముఖ్యంగా తాను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టే ఏ ఫోటో అయినా ప్రొఫెషనల్‌గా వుండేలా ఒక టీమ్‌నే అప్పాయింట్‌ చేసుకుంది. ఈ టీమ్‌లో పర్సనల్‌ డిజైనర్‌, మేకప్‌, ఫోటోగ్రాఫర్‌ అంతా వున్నారు. వీరి కోసం సమంత భారీగానే ఖర్చు పెడుతోంది కానీ సోషల్‌ మీడియాలో తన ఫోటోలు అద్భుతంగా వస్తాయి కనుక ఆ మాత్రం ఖర్చు పెట్టినా ఫర్వాలేదు అంటోందట.

సమంతకి ఈమధ్య సినిమాలు తగ్గినా కానీ తనకి వస్తోన్న చిన్న సినిమాలలో కూడా తనకి నచ్చిన పాత్రలు వుంటేనే చేస్తానని ఫిక్స్‌ అయిపోయింది. అవకాశాలు తగ్గిపోయిన దశలో ఈ పర్సనల్‌ టీమ్‌ దేనికో అనే కామెంట్లు కూడా పడుతున్నాయి.

ఈ టీమ్‌నేదో బిజీగా వున్న తన భర్తకి అప్పగించి అతడిని హైలైట్‌ అయ్యేలా చూసుకుంటే మేలు కదా అనే వాళ్లు కూడా వున్నారు మరి. కానీ మేడమ్‌ అక్కినేని ఇలా డిసైడ్‌ అయ్యారు కనుక ఆమె అభిమానులకి సోషల్‌ మీడియాలో ఇకపై అందమైన ఫోటోలు మాత్రమే దర్శనమిస్తాయన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English