సైరా చివరి ఆశ నీరుగారింది!

 సైరా చివరి ఆశ నీరుగారింది!

తెలుగు రాష్ట్రాలలో బాహుబలి తర్వాత మరే చిత్రం సాధించని వంద కోట్ల షేర్‌ మైలురాయిని అందుకున్న సైరా నరసింహారెడ్డి ఓవర్సీస్‌లో, నార్త్‌ అమెరికాలో మాత్రం టాప్‌ 10 ఎంట్రీతో సరిపెట్టుకునేలా వుంది. ఆదివారంతో రెండున్నర మిలియన్లు సాధించిన తొలి చిరంజీవి సినిమాగా సైరా రికార్డులకి ఎక్కనుంది.

మూడున్నర మిలియన్లు సాధించి రంగస్థలం రికార్డుని అధిగమిస్తుందని భావించారు కానీ సాహోకి వచ్చినట్టుగా ఇతర భాషల నుంచి సైరాకి ఎలాంటి బెనిఫిట్‌ జరగలేదు. 2.6 మిలియన్‌కి కాస్త అటు, ఇటుగా ఈ చిత్రం ఫుల్‌ రన్‌ వసూళ్లు వుంటాయి.

అంటే బ్రేక్‌ ఈవెన్‌కి కనీసం అర మిలియన్‌ దూరంలో వుండిపోతుంది. సెకండ్‌ వీకెండ్‌లో పెద్ద సినిమాలేవీ లేవు కనుక వసూళ్లు పుంజుకుంటాయని ఫాన్స్‌ ఆశ పడ్డారు కానీ ఇటీవల వచ్చిన చాలా చిత్రాల మాదిరిగానే సెకండ్‌ వీకెండ్‌లో సైరాకి చెప్పుకోతగ్గ వసూళ్లు రాలేదు. సెకండ్‌ వీకెండ్‌ బాగుంటే మూడు మిలియన్ల దగ్గరకి వెళుతుందని ఆశించారు కానీ అది జరగలేదు.

టాక్‌ బాగా వచ్చి, రేటింగ్స్‌ పడినా కూడా సైరా మూడు మిలియన్లు రీచ్‌ అవలేకపోవడంతో ఓవర్సీస్‌ బయ్యర్లలో గుబులు మొదలయింది. ఇకపై భారీ చిత్రాలపై భారీ మొత్తాలు పెట్టడం శ్రేయస్కరమేనా అనే ఆలోచనలు కూడా జరుగుతున్నాయి.

పెద్ద సినిమాలకి బ్రేక్‌ ఈవెన్‌ మార్క్‌ రెండు నుంచి రెండున్నర మిలియన్లు వుండేలా ఆఫర్స్‌ ఇవ్వాలని, లేదంటే సినిమాలు కొనకూడదని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English