రజనీ సినిమాకు దిల్ రాజు మాస్టర్ ప్లాన్

రజనీ సినిమాకు దిల్ రాజు మాస్టర్ ప్లాన్

ఈ ఏడాది సంక్రాంతికి సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ‘పేట’కు తెలుగులో దయనీయమైన పరిస్థితి నెలకొంది. ఈ సినిమా లేటుగా రేసులోకి రావడం, అప్పటికే ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’, ‘వినయ విధేయ రామ’, ‘ఎఫ్-2’ సినిమాలకు థియేటర్లు బుక్ అయిపోవడంతో దీన్ని చాలా తక్కువ థియేటర్లలో రిలీజ్ చేయాల్సి వచ్చింది. సినిమాకు టాక్ కూడా అంత గొప్పగా లేకపోవడంతో తర్వాత కూడా థియేటర్లు పెరగలేదు. దీంతో వసూళ్లు మరీ కనీస స్థాయిలో వచ్చాయి.

అప్పుడు ఆ సినిమాకు థియేటర్లు కేటాయించలేదంటూ ఆ చిత్ర నిర్మాత వల్లభనేని అశోక్ దిల్ రాజు, అల్లు అరవింద్‌ల మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఐతే అప్పుడు రజనీ సినిమాకు విలన్ లాగా ప్రొజెక్ట్ అయిన దిల్ రాజు.. రాబోయే సంక్రాంతికి రజనీ సినిమాను టేకప్ చేసి మాస్టర్ ప్లాన్‌తో రంగంలోకి దిగుతుండటం విశేషం.

సూపర్ స్టార్ కొత్త సినిమా ‘దర్బార్’ను యువి క్రియేషన్స్ వాళ్లతో కలిసి దిల్ రాజే తెలుగులో రిలీజ్ చేయబోతున్నాడట. సంక్రాంతికి షెడ్యూల్ అయిన భారీ సినిమాలు ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ జనవరి 12కు ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. కొత్తగా సంక్రాంతి రేసులోకి వచ్చిన ‘వెంకీ మామ’ సినిమాను జనవరి 14కు అనుకుంటుండగా.. కళ్యాణ్ రామ్ సినిమా ‘ఎంత మంచివాడవురా’ రేసులోనే ఉండేట్లయితే జనవరి 15న విడుదలయ్యే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో సంక్రాంతి రేసులో ముందుగా ‘దర్బార్’ను రేసులో నిలబెట్టేయాలన్నది ప్లాన్. తమిళంలోనూ ఈ చిత్రాన్ని జనవరి 10న రిలీజ్ చేయాలనే అనుకుంటున్నారు. ఆ రోజు తెలుగు రాష్ట్రాల్లోని మెజారిటీ థియేటర్లలో ‘దర్బార్’ను విడుదల చేస్తారు. రెండు రోజుల్లో ఎంత వీలైతే అంత వసూళ్లు రాబట్టుకోవడమే లక్ష్యం. సినిమాకు టాక్ బాగుంటే ఆ రెండు రోజుల్లోనే మంచి షేర్ వచ్చే అవకాశముంది. ఆ తర్వాత వచ్చేదంతా బోనస్ అనుకోవచ్చు. ఈ ప్లాన్‌తోనే ‘దర్బార్’ను రాజు అండ్ కో టేకప్ చేసినట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English