సైరా.. ఒకే థియేటర్లో కోటి రూపాయలు

సైరా.. ఒకే థియేటర్లో కోటి రూపాయలు

టాలీవుడ్లో తాను ఎప్పటికీ మెగా స్టార్‌నే అని చిరంజీవి మరోసారి రుజువు చేస్తున్నాడు. దశాబ్ద విరామం తర్వాత ‘ఖైదీ నంబర్ 150’ సినిమాతోనే తన స్టామినా ఏంటో చూపించాడు చిరు. ఇప్పుడు ‘సైరా నరసింహారెడ్డి’తో మరోసారి చిరు స్థాయి అందరికీ అర్థమవుతోంది. తొలి వారాంతం తర్వాత వసూళ్లు దారుణంగా పడిపోతున్న ఈ రోజుల్లో.. సైరా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో రెండో వారంలోనూ చక్కటి వసూళ్లతో సాగిపోతుండటం విశేషమే.

ఏపీ, తెలంగాణల్లోనే రూ.100 కోట్ల షేర్ మార్కును దాటేలా కనిపిస్తోందీ చిత్రం. ఇక ఏరియాల వారీగా మైల్ స్టోన్స్ దాటుకుంటూ వెళ్తున్న ‘సైరా’ హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సింగిల్ థియేటర్లో కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. అది కూడా పదో రోజుకే కావడం.

క్రాస్ రోడ్స్‌లో ‘సైరా’ ఆడుతున్న సుదర్శన్ థియేటర్లో పదో రోజు గ్రాస్ రూ.కోటి మార్కును దాటింది. తొలి ఐదు రోజుల్లో క్రాస్ రోడ్స్‌లోని నాలుగు థియేటర్లలో ‘సైరా’ ఆడటం విశేషం. వీకెండ్ తర్వాత రెండు థియేటర్లకు తగ్గించారు. అయినా ఒక థియేటర్లోనే పది రోజులకు కోటి రూపాయల గ్రాస్ అంటే చిన్న విషయం కాదు. చిరు తనయుడు రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమా ఇదే సుదర్శన్ థియేటర్లో ఏకంగా రూ.2.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ఫుల్ రన్లో. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘జై లవకుశ’ ఒక థియేటర్లో సరిగ్గా కోటి రూపాయల గ్రాస్ రాబట్టింది. ఇటీవలే వచ్చిన ప్రభాస్ సినిమా ‘సాహో’ 1.4 కోట్లు కొల్లగొట్టింది. ‘బాహుబలి’ రెండు భాగాలూ సింగిల్ థియేటర్లో రూ.2 కోట్ల మార్కును దాటాయి. ‘సైరా’ ఫుల్ రన్లో ఇక్కడ ఎంత వసూలు చేస్తుందో చూడాలి. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English