సైరా ముందుగా సేఫ్‌ అయిందక్కడే!

సైరా ముందుగా సేఫ్‌ అయిందక్కడే!

బాహుబలి సినిమాలకి తీసిపోదనే నమ్మకంతో సైరా నరసింహారెడ్డిని భారీ రేట్లకి కొనేసారు. బాహుబలి 2కి వచ్చిన చారిత్రాత్మక స్పందన రాకపోయినప్పటికీ సైరాతో మరోసారి చిరంజీవి స్టార్‌డమ్‌ అయితే ఈ తరానికి తెలిసి వచ్చింది. ఖైదీ నంబర్‌ 150తో వంద కోట్ల షేర్‌ సాధించిన చిరంజీవి, సైరాతో కేవలం తెలుగు రాష్ట్రాలలోనే వంద కోట్ల షేర్‌ మైలురాయిని ఆది లేదా సోమవారంతో చేరుకోబోతున్నారు.

ఇదిలావుంటే తెలుగు రాష్ట్రాలలో ముందుగా ఉత్తరాంధ్రలో సైరా బ్రేక్‌ ఈవెన్‌ అయి లాభాల్లోకి అడుగు పెట్టింది. పధ్నాలుగు కోట్ల రూపాయలకి ఈ ఏరియా రైట్లు అమ్ముడు కాగా, పది రోజుల్లోనే పధ్నాలుగు కోట్ల మార్కుని సైరా దాటేసింది. ఇప్పటికీ రోజుకి కోటి రూపాయల వరకు షేర్‌ వస్తోంది కనుక ఈ ఏరియా బయ్యర్‌కి మంచి లాభాలు గ్యారెంటీ అని ట్రేడ్‌ అంటోంది. ఉత్తరాంధ్రలో చిరంజీవికి వున్న పట్టు మరోసారి సైరాతో చాటిచెప్పినట్టయింది. ఖైదీ నంబర్‌ 150 వచ్చినపుడు బాహుబలి రికార్డుని ఉత్తరాంధ్రలో చిరంజీవి బీట్‌ చేయడం జరిగింది.

ఇప్పుడు కూడా సైరాతో నాన్‌ బాహుబలి 2 రికార్డు చిరంజీవి కైవసమయింది. నైజాంలో రేపటితో సైరా ముప్పయ్‌ కోట్ల మార్కు చేరుకుంటుంది. బాహుబలి సినిమాల తర్వాత నైజాంలో ముప్పయ్‌ కోట్లు రాబట్టిన మరో చిత్రమే లేదు. తెలుగు రాష్ట్రాల బయట అంచనాలని అందుకోలేకపోయినా కానీ తెలుగు రాష్ట్రాలలో మాత్రం చిరంజీవి బ్రాండ్‌కి తిరుగు లేదని సైరాతో ఇంకోసారి తేటతెల్లమయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English