కొడుకును అలా పొగిడేస్తే ఎలా చిరు సార్?

కొడుకును అలా పొగిడేస్తే ఎలా చిరు సార్?

ఎంతటి వారైనా క‌న్న ప్రేమ‌కు లొంగిపోతార‌న‌డానికి మెగాస్టార్ చిరంజీవే రుజువు. ఆయ‌న రామ్ చ‌ర‌ణ్ గురించి మాట్లాడితే చాలు అదుపు త‌ప్పి పోతారు. మ‌న బిడ్డ‌ల్ని మ‌న‌మే పొగుడుకుంటే బాగుండ‌ద‌నే విష‌యాన్ని కూడా ఆయ‌న ప‌ట్టించుకోర‌నిపిస్తుంది చిరు మాట‌లు చూస్తే. టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి స్థానం చెక్కుచెద‌ర‌నిది.

ఆయ‌న‌తో పోల్చ‌ద‌గ్గ హీరో మ‌రొక‌రు క‌నిపించ‌రు. పుష్క‌రం కింద‌ట ఆయ‌న సినిమాలు మానేస్తే స‌గ‌టు తెలుగు సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఫీల‌య్యారు. ఆయ‌న స్థానాన్ని ఎవ‌రు భ‌ర్తీ చేస్తార‌న్న ప్ర‌శ్న త‌లెత్తితే.. ఆ స్థానం ఇంకెవ‌రికీ సొంతం కాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మైంది. కానీ చిరు వ‌చ్చి మ‌గ‌ధీర సినిమాతో చ‌ర‌ణ్ త‌న స్థానాన్ని భ‌ర్తీ చేశాడంటూ దాని విడుద‌ల‌కు ముందే పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు.

ఏదో ఒక‌సారి మాట వ‌ర‌స‌కు అలా అన్నాడ‌నుకుంటే ఏదోలే అనుకోవ‌చ్చు. కానీ రంగ‌స్థ‌లం త‌ర్వాత చ‌ర‌ణ్ త‌న‌కు దీటుగా నిలిచాడ‌ని.. కొన్ని విష‌యాల్లో త‌న‌ను మించిపోయాడ‌ని అన్నాడు. తాజాగా చిరు చ‌ర‌ణ్ గురించి మ‌రో పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. తాను హీరోగా 151 సినిమాలు చేశాన‌ని.. ఐతే త‌న‌తో ప‌ని చేసిన అంద‌రు నిర్మాత‌ల్లోకి ది బెస్ట్ రామ్ చ‌ర‌ణే అని చెప్పాడ‌త‌ను. చ‌ర‌ణ్ త‌న కెరీర్లో నంబ‌ర్ వ‌న్ ప్రొడ్యూస‌ర్ అని ట్యాగ్ లైన్ కూడా ఇచ్చాడు.

తండ్రితో సినిమా తీసిన‌పుడు చ‌ర‌ణ్ ముందు వెనుక చూడ‌కుండా ఖ‌ర్చుపెట్ట‌డం, రాజీ లేకుండా సినిమాను నిర్మించ‌డం.. చిరుకు భారీ పారితోష‌కం ఇవ్వ‌డంలో ఆశ్చ‌ర్య‌మేముంది? అంత‌మాత్రాన చిరుతో ఎన్నో అద్భుత‌మైన సినిమాలు అందించిన నిర్మాత‌లంద‌రినీ వెన‌క్కి నెట్టి చ‌ర‌ణే త‌న కెరీర్లో నంబ‌ర్ వ‌న్ ప్రొడ్యూస‌ర్ అంటే అతిగా అనిపించ‌దూ? అయినా చ‌ర‌ణ్ ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌పుడ‌ల్లా అతిగా పొగిడే అల‌వాటును చిరు విడిచిపెడితే బెట‌ర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English