నాన్ స్టాప్ ర‌జ‌నీ ఎక్స్‌ప్రెస్.. ఇంకోటి ఓకే

 నాన్ స్టాప్ ర‌జ‌నీ ఎక్స్‌ప్రెస్.. ఇంకోటి ఓకే

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఆలోచ‌న‌లేంటో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. సినిమాలే కెరీర్‌గా సాగిన‌పుడు ఆయ‌న చాలా నెమ్మ‌దిగా ఉన్నారు. సినిమాకు సినిమాకు గ్యాప్ ఇస్తూ.. రెండేళ్ల‌కొక‌టి.. మూడేళ్ల‌కొక‌టి చేసిన సంద‌ర్భాలున్నాయి. కానీ ఎప్పుడైతే ర‌జ‌నీ రాజ‌కీయ అరంగేట్రం ఖ‌రారైందో అప్ప‌టి నుంచి ఆయ‌న ఎక్క‌డ లేని స్పీడు అందుకున్నారు.

70వ ప‌డికి చేరువ అవుతూ ఈ వ‌య‌సులో చాలా ఉత్సాహంగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. గ‌త ఏడాది కాలా, 2.0 సినిమాల‌తో ప‌ల‌క‌రించిన ఆయ‌న ఈ ఏడాది ఆరంభంలో పేట సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ద‌ర్బార్ సినిమా చేస్తున్నాడు సూప‌ర్ స్టార్. ఇది పూర్తి కావ‌స్తోంది.

ఐతే పార్టీని ప్ర‌క‌టించి వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌న్న‌ద్ధం కావాల్సిన స్థితిలో ర‌జ‌నీ ఇక సినిమాలు చేయ‌డేమో అనుకున్నారు అభిమానులు. కానీ ర‌జ‌నీ ఆగ‌ట్లేదు. స‌న్ పిక్చ‌ర్స్ నిర్మాణంలో ర‌జ‌నీ కొత్త సినిమాను ఈ రోజే ప్ర‌క‌టించారు. కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్లు శివ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది.

తెలుగులో శౌర్యం సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారిన శివ‌.. ఆ త‌ర్వాత త‌మిళంలో అజిత్‌తో వ‌రుస‌గా నాలుగు మాస్ మ‌సాలా సినిమాలు చేసి క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్‌గా మంచి పేరు సంపాదించాడు. చివ‌ర‌గా విశ్వాసం సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన శివ‌.. ఇటీవ‌లే ర‌జ‌నీకి క‌థ చెప్పి ఓకే చేయించుకున్నాడు. ఈ భారీ బ‌డ్జెట్ మూవీ త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌బోతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English