ప్రభాస్ అందులో హిట్.. చిరు ఇందులో హిట్

ప్రభాస్ అందులో హిట్.. చిరు ఇందులో హిట్

ఉద్దేశపూర్వకంగా హైప్ వద్దనుకుని ఆగారా.. లేదా ప్లానింగ్ తేడా కొట్టిందా అన్నది తెలియదు కానీ.. 'సైరా నరసింహారెడ్డి'ని విడుదలకు ముందు ఆశించిన స్థాయిలో చిత్ర బృందం ప్రమోట్ చేయని మాట వాస్తవం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు హైప్ తేవడానికి ప్రత్యేక కృషి అక్కర్లేదు కానీ.. ఇతర రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉత్తరాదిన ఈ సినిమాకు ప్రమోషన్లు లేకపోవడం గట్టి దెబ్బే కొట్టింది. ఈ విషయంలో ప్రభాస్‌ను మాత్రం అభినందించాల్సిందే.

ప్రభాస్ తన సినిమా 'సాహో'ను భలేగా ప్రమోట్ చేశాడు నార్త్ ఇండియాలో. అక్కడ పలు రాష్ట్రాల్లో తిరిగాడు. పదుల సంఖ్యలో ఇంటర్వ్యూలు ఇచ్చాడు. టీవీ కార్యక్రమాలకు హాజరయ్యాడు. అది సినిమాకు బాగానే కలిసొచ్చింది. ఫ్లాప్ టాక్‌తో కూడాా 'సాహో' ఉత్తరాదిన బాగా ఆడింది. ఐతే రిలీజ్ తర్వాత ప్రభాస్ అసలు అడ్రస్ లేకుండా పోయాడు. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లనేవే లేకపోయాయి. అవి ఉంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా కొంచెం మెరుగ్గా ఆడేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ప్రభాస్ సక్సెస్ అయిన విషయంలో చిరు ఫెయిలయ్యాాడు. ప్రి రిలీజ్ ప్రమోషన్లలో చాలా వీక్‌గా కనిపించాడు. కానీ ప్రభాస్ ఫెయిలైన చోట చిరు విజయవంతం అయ్యాడు. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో చిరు అదరగొడుతున్నాడు. సినిమా విడుదలైన దగ్గర్నుంచి దాదాపుగా ప్రతి రోజూ సినిమాను ఏదో ఒక రకంగా వార్తల్లో నిలబెడుతున్నాడు.

థ్యాంక్స్ మీట్, త్రివిక్రమ్ ఇంటర్వ్యూ, టి.సుబ్బిరామిరెడ్డి సత్కారం.. ఇలా పలు కార్యక్రమాల్లో పాల్గొని సినిమా గురించి తెగ మాట్లాడేస్తూ 'సైరా'ను లైవ్లీగా ఉంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. రెండో వారంలో కూడా 'సైరా' మంచి కలెక్షన్లతో సాగిపోతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English