చిరంజీవికి ఇంత కష్టమెందుకు?

చిరంజీవికి ఇంత కష్టమెందుకు?

చిరంజీవి, చరణ్‌ కలిసి నటిస్తున్నారనే వార్త బయటకు రాగానే గుల్టీ.కామ్‌ ముందుగా... చిరంజీవి యంగ్‌గా కనిపించే పోర్షన్‌ని చరణ్‌ చేస్తాడని గెస్‌ చేసింది. ఇప్పుడు అదే నిజమయింది. కొరటాల శివ డైరెక్షన్‌లో రూపొందే ఈ చిత్రంలో చిరంజీవి యంగ్‌గా కనిపించాల్సిన పోర్షన్‌ వుంది. అది చిరంజీవితోనే చేస్తే సైరా చిత్రానికి వచ్చిన కామెంట్లు వస్తాయనే ఫీలింగ్‌ కొరటాలతో పాటు చిరు, చరణ్‌కి కూడా కలిగింది.

అరవై అయిదేళ్ల వయసులో పాతికేళ్ల యువకుడిగా కనిపించడం చిరంజీవికి ఇబ్బందిగా వుంటుంది. ఆ సన్నివేశాలు తెరపై చూడ్డానికి ప్రేక్షకులకీ అయిష్టంగానే వుంటుంది. సైరాలో తమన్నాతో సన్నివేశాలకి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో ఇందులో యంగ్‌ పోర్షన్‌ని చరణ్‌తో చేయించాలని డిసైడ్‌ అయ్యారు. ఈ ఆలోచన బాగానే వుంది కానీ దీనిని ప్రేక్షకులు ఎంతవరకు రిసీవ్‌ చేసుకుంటారనేది తెలియదు.

చిరు, చరణ్‌లకి పోలికలు తక్కువ. ఆహార్యం, ఎత్తు, బరువుల్లో కూడా చాలా తేడాలుంటాయి. మరి చరణ్‌ పెద్దయ్యి చిరంజీవి అయ్యాడనేది ఎంతవరకు యాక్సప్టబుల్‌ అనేది తెరపై చూస్తే కానీ తెలియదు. అయితే ఇదంతా తెలిసిన అభిమానులు కూడా చిరంజీవి ఎందుకని ఇంకా ఇలాంటి కథలు ఎంచుకోవడం, తన వయసుకి సూట్‌ అయ్యే పాత్రలే చేయవచ్చు కదా అనేస్తున్నారు. సైరాతో హీరో వేషాలు కట్టిపెట్టి ఇక మెచ్యూర్డ్‌ రోల్స్‌కి షిఫ్ట్‌ అవ్వాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English