నైజాంలో సడన్‌గా పికప్‌ అయిన సైరా!

నైజాంలో సడన్‌గా పికప్‌ అయిన సైరా!

ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణలో కాస్త వీక్‌ ట్రెండింగ్‌ చూపించిన 'సైరా' దసరా పండుగ నుంచి సడన్‌ రైజ్‌ చూపించడం ట్రేడ్‌ని కూడా ఒకింత సర్‌ప్రైజ్‌ చేసింది. ఏడవ రోజు కంటే ఎనిమిదివ రోజున నైజాంలోని బి, సి సెంటర్స్‌లో 'సైరా' వసూళ్లు పుంజుకున్నాయి. ఎనిమిదవ రోజున, అది కూడా వర్కిండ్‌ డేకి నైజాంలో దాదాపు రెండున్నర కోట్ల షేర్‌ రావడంతో ఒక్కసారిగా ట్రేడ్‌లో ఉత్సాహం కనిపిస్తోంది.

ముప్పయ్‌ కోట్లకి ఈ ఏరియా రైట్స్‌ అమ్ముడు కాగా, ఎనిమిదివ రోజుకి దాదాపు ఇరవై ఆరున్నర కోట్ల షేర్‌ వసూలయింది. ఈ జోరుతో వీకెండ్‌కి నైజాంలో సైరా లాభాల్లోకి అడుగు పెడుతుంది. మొదటి రెండు రోజుల తర్వాత నైజాంలో ట్రెండింగ్‌ ఫ్లాట్‌గా వుండడం, ఆదివారం కూడా కలక్షన్లలో పెద్దగా పురోగతి లేకపోవడంతో కలక్షన్స్‌ డ్రాప్‌ అవుతాయని భావించారు.

కానీ సడన్‌గా పుంజుకున్న వసూళ్లతో సైరా ఇప్పుడు ఉత్తరాంధ్ర, సీడెడ్‌తో పాటు నైజాంలో కూడా వారాంతానికి ప్రాఫిట్‌ జోన్‌లోకి వచ్చేస్తుందని తేలిపోయింది. ఆంధ్రలో మిగతా ఏరియాలలో కూడా స్టడీగా వున్న వసూళ్లతో అన్ని చోట్లా బ్రేక్‌ ఈవెన్‌ ఖాయమని ట్రేడ్‌ అంటోంది. అయితే తెలుగు రాష్ట్రాల బయట మాత్రం సైరాకి నష్టాలు తప్పేటట్టు లేవు. ముఖ్యంగా కర్నాటకలో భారీ నష్టం పొంచి వుంది. తమిళనాడు, కేరళ, నార్త్‌ ఇండియాలో సొంతంగా విడుదల చేసుకోవడం వల్ల అక్కడ వచ్చిన వసూళ్లతో ఫరక్‌ ఏమీ పడదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English