ఎంత మంచి ఛాన్స్ మిస్స‌య్యావ్ వెంకీ మామా

ఎంత మంచి ఛాన్స్ మిస్స‌య్యావ్ వెంకీ మామా

తెలుగులో సైరా న‌ర‌సింహారెడ్డి త‌ర్వాత ఇప్పుడిప్పుడే పెద్ద సినిమా ఏదీ రిలీజ‌య్యేలా లేదు. సైరా సంద‌డి ముగిశాక డ్రై డేస్ మొద‌లు కాబోతున్నాయి. ఈ వారం వ‌చ్చే వారం చెప్పుకోద‌గ్గ సినిమాలే లేవు. ఈ గ్యాప్ త‌ర్వాత దీపావ‌ళి సీజ‌న్లో కాస్త పెద్ద సినిమా ఏదైనా వ‌స్తే మంచి వ‌సూళ్లు వ‌చ్చే అవ‌కాశ‌ముంది. కానీ ఆ సీజ‌న్‌ను ఉప‌యోగించుకునే ప్ర‌య‌త్నం ఎవ్వ‌రూ చేయ‌ట్లేదు.

ముందు ద‌స‌రా సీజ‌న్‌ను టార్గెట్ చేసిన వెంకీ మామ‌.. సైరాతో పోటీ ఎందుకుని దీపావ‌ళికి వెళ్లిన‌ట్లు ఇంత‌కుముందు వార్త‌లొచ్చాయి. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా దీపావ‌ళికి కూడా రాద‌ట‌. డిసెంబ‌రు తొలి వారం లేదా రెండో వారంలో విడుద‌ల చేయాల‌ని చూస్తున్నార‌ట‌.

 ఐతే డిసెంబ‌రు మూడో వారం నుంచి సినిమాల మోత మోగ‌బోతోంది. ఆ టైంలో కాకుండా అన్ని సినిమాల ముందు వెంకీ మామ‌ను రిలీజ్ చేయ‌డం క‌న్నా.. అస‌లు పోటీయే లేని దీపావ‌ళికి ఇలాంటి మాస్, ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ రిలీజ్ చేస్తే మంచి ఫ‌లితం ఉంటుందేమో. నిజానికి గ‌త నెల‌లోనే వెంకీ మామ చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన‌ట్లుగా అప్ డేట్ ఇచ్చారు. ఇదేమీ గ్రాఫిక్స్, వీఎఫెక్స్‌తో ముడిప‌డ్డ సినిమా కాదు, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ నెల‌ల‌కు నెల‌లు చేయ‌డానికి.

మ‌రి సినిమాను అంత లేటుగా రిలీజ్ చేయాల‌ని ఎందుకునుకుంటున్నారో ఏమో తెలియ‌దు మ‌రి. రామానాయుడి కోరిక‌ను నెర‌వేరుస్తూ మామా అల్లుళ్ల‌యిన వెంకీ, చైతూల‌తో సురేష్ బాబు ఈ సినిమాను నిర్మించాడు. కె.ఎస్.ర‌వీంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English