సైరా దెబ్బకి బెంబేలెత్తిపోతున్నారు!

సైరా దెబ్బకి బెంబేలెత్తిపోతున్నారు!

ఓవర్సీస్‌ మార్కెట్‌... ముఖ్యంగా అమెరికా మార్కెట్‌ ఇటీవల బాగా క్షీణించింది. సాహో చిత్రం అంచనాలని అందుకోలేకపోతే నెగెటివ్‌ రివ్యూలు కారణమని సరిపెట్టుకున్నారు. కానీ సైరాకి మంచి రివ్యూలు వచ్చినా కానీ అమెరికాలో గొప్ప వసూళ్లేమీ రావడం లేదు. ఇంకా రెండున్నర మిలియన్లని చేరుకోని సైరా ఓవరాల్‌గా మూడు మిలియన్లు సాధిస్తుందనేది అనుమానంగానే వుంది.

ఈమధ్య అక్కడి మార్కెట్‌ ఎంతగా క్షీణించిందనేది చెప్పడానికి ఇదో ఉదాహరణ. హత్యలు, ఉరి తీయడాలు నేపథ్యంలో సాగే సీరియస్‌ చారిత్రిక కథ కాబట్టి కొంత నష్టం వాటిల్లి వుండవచ్చుననే వివరణలు వినిపిస్తున్నా కానీ సంక్రాంతికి వచ్చే రెండు భారీ చిత్రాలకి తగ్గ వసూళ్లు అమెరికాలో వస్తాయా అనే అనుమానం నెలకొంది. మహేష్‌ సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్‌ అల వైకుంఠపురములో చిత్రాలకి కలిపి అయిదు మిలియన్‌ డాలర్లు వసూలయితే కానీ బ్రేక్‌ ఈవెన్‌ కావు.

మరి అంత మొత్తం రాబట్టే రేంజ్‌ ఇప్పుడు అమెరికా మార్కెట్‌కి వుందా? సైరా విడుదలయ్యే వరకు వేచి చూసినట్టయితే అక్కడి బయ్యర్లు ఇంత పెద్ద మొత్తాలు ఇన్వెస్ట్‌ చేసి వుండేవారు కాదేమో కానీ సైరా ఫలితం చూసిన తర్వాత మాత్రం అమెరికా రైట్స్‌ తీసుకున్న వారికి గుబులు పట్టుకుంది. మహేష్‌ గత చిత్రం మహర్షి కనీసం రెండు మిలియన్లు కూడా సాధించలేకపోవడంతో అది కూడా బయ్యర్లని భయభ్రాంతులకి గురి చేస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English