తాగుబోతు శృతిహాసన్‌

తాగుబోతు శృతిహాసన్‌

సినీ పరిశ్రమలో వ్యసనాల బారిన పడడం కొత్త విషయమేమీ కాదు. పలువురు తారలు తాగుడు, జూదం లాంటి వ్యసనాలకి బానిసలయి చాలా ఇబ్బందులు పడ్డారు. మహానటి చూస్తే సావిత్రి మద్యానికి బానిసగా మారి ఎన్ని ఇబ్బందులు పడిందనేది అర్థమవుతుంది. అలాగే శృతిహాసన్‌ కూడా మద్యానికి బానిసగా మారి చాలా సమస్యలు ఎదుర్కొందట.

ఒకానొక సమయంలో మద్యం మానలేక కెరియర్‌ పరంగా కూడా ఇబ్బందులు ఫేస్‌ చేసిందట. ఆరోగ్య పరంగా కూడా చాలా సమస్యలు రావడంతో కొంతకాలం సినిమాలకి దూరం కావాల్సి వచ్చిందని శృతి చెప్పింది. గత ఏడాది కాలంగా మద్యానికి దూరంగా వుంటున్నానని, ఇక మళ్లీ దాని జోలికి పోనని ఓ టాక్‌ షోలో శృతిహాసన్‌ చెప్పింది. సాధారణంగా సినిమా తారలు తమ బలహీనతలు, దురలవాట్ల గురించి బయటకి చెప్పుకోరు.

మీడియాలో వార్తలు వచ్చినా కానీ పుకార్లు అంటూ కొట్టి పారేస్తారు. కానీ శృతిహాసన్‌ తన చెడ్డ అలవాటు గురించి ధైర్యంగా మాట్లాడేసి తన ప్రత్యేకత చాటుకుంది. త్వరలోనే సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేస్తోన్న శృతి ఈసారి ఇలాంటి వాటికి దూరంగా వరుస విజయాలు అందుకోవాలనే ఆశిద్దాం మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English