సైరా దర్శకుడిపై సాహో కన్ను

సైరా దర్శకుడిపై సాహో కన్ను

ప్రభాస్‌కి ఇప్పుడున్న పాన్‌ ఇండియా ఇమేజ్‌కి న్యాయం చేయగల ఒకే ఒక్క తెలుగు దర్శకుడు రాజమౌళి. కానీ రాజమౌళితో సినిమా అనేది అంత ఈజీ కాదు. అందుకని ప్రత్యామ్నాయాల కోసం ప్రభాస్‌ టీమ్‌ బాగా అన్వేషిస్తోంది. వీరి దృష్టిలో సైరా దర్శకుడు సురేందర్‌ పడ్డాడని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అంత భారీ బడ్జెట్‌ చిత్రాన్ని, అంతటి భారీ తారాగణాన్ని బాగా హ్యాండిల్‌ చేయడంతో పాటు విజువల్‌ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన వర్క్‌ కూడా బాగా చేయించుకోవడంతో సురేందర్‌ చేతిలో ఒక భారీ చిత్రం పెడితే బాగుంటుందని ప్రభాస్‌ భావిస్తున్నాడట.

ఇదే విషయాన్ని యువి క్రియేషన్స్‌ వారు కూడా అంగీకరించారట. సురేందర్‌తో జేమ్స్‌బాండ్‌ తరహా యాక్షన్‌ చిత్రం చేస్తే తనకి నేషనల్‌ వైడ్‌గా వున్న ఇమేజ్‌కి తగిన న్యాయం జరుగుతుందని ప్రభాస్‌ భావిస్తున్నాడని, ఇప్పటికే సురేందర్‌తో ఒక మాట చెప్పడం, అతను కొంత విరామం తీసుకుని కథ సిద్ధం చేస్తాననడం జరిగిపోయాయని, అన్నీ కుదిరితే ప్రభాస్‌ చేస్తోన్న 'జాను' తర్వాత ఈ కాంబినేషన్‌లోనే సినిమా వుండవచ్చునని టాలీవుడ్‌ టాక్‌.

ఇదిలావుంటే ప్రభాస్‌ డేట్స్‌ ఎలాగైనా సాధించి అతనితో పాన్‌ ఇండియా సినిమా తీయాలని దిల్‌ రాజు ముమ్మర యత్నాలు చేస్తున్నాడట. అయితే ప్రభాస్‌ ఇప్పటివరకు తన సొంత బ్యానర్‌ వదిలి బయటకు వెళ్లడం గురించి ఆలోచించలేదట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English