చిరు 152.. ఇంకా సస్సెన్సే

చిరు 152.. ఇంకా సస్సెన్సే

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా చడీచప్పుడు లేకుండా మొదలైపోయింది. ‘దసరా పండుగను పురస్కరించుకుని మంగళవారం ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ప్రొడక్షన్ గురించి వివరాలు వెల్లడించారు.

ముందు అనుకున్నట్లు రామ్ చరణ్ ఒక్కడే ఈ చిత్రాన్ని నిర్మించట్లేదు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కూడా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో కలుస్తోంది. ఇంతకుముందు కొరటాలతో ‘జనతా గ్యారేజ్’ సినిమాకు పని చేసిన తిరు ఈ చిత్రానికి ఛాయాగ్రహణం సమకూరుస్తున్నాడు.

దేశంలోనే నంబర్ వన్ ఎడిటర్ అనదగ్గ శ్రీకర్ ప్రసాద్ ఈ చిత్రానికి కూర్పు అందించనున్నాడు. సురేష్ సెల్వరాజన్‌ ప్రొడక్షన్ డిజైన్ చేయనున్నాడు. ఐతే అన్నీ ఖరారైనా.. సంగీత దర్శకుడి సంగతి మాత్రం ఇప్పుడే తేల్చకపోవడం ఆశ్చర్యకరం.

కొరటాల శివ సినిమా అనగానే దేవిశ్రీ ప్రసాద్ ఆటోమేటిగ్గా మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉండేవాడు. ఇప్పటిదాకా కొరటాల చేసిన నాలుగు సినిమాలకూ అతనే సంగీత దర్శకుడు. అయితే ఈ చిత్రానికి దేవిశ్రీని కొరటాల పక్కన పెట్టాడని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అది నిజమే అని అర్థమవుతోంది. దేవినే ఈ సినిమాకు పని చేసేట్లయితే ప్రారంభోత్సవంలో అతను కచ్చితంగా ఉండేవాడు.

అతడి పేరును అధికారికంగా ప్రకటించి ఉండేవాళ్లు. ‘సైరా’కు మ్యూజిక్ చేసిన అమిత్ త్రివేది కానీ.. లేదా అజయ్-అతుల్‌ కానీ ఈ సినిమాకు సంగీతం అందిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఇంకా ఒక క్లారిటీకి వచ్చినట్లు లేదు. అందుకే ప్రారంభోత్సవం నాడు ఏ విషయం ప్రకటించలేదు. మరోవైపు ఈ సినిమాలో కథానాయిక/కథానాయికలు ఎవరు అన్నది కూడా ఇంకా ఖరారైనట్లుగా లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English