‘బిగ్ బాస్’లో చివరికి మిగిలేదెవరు?

‘బిగ్ బాస్’లో చివరికి మిగిలేదెవరు?

‘బిగ్ బాస్’ మూడో సీజన్ అనేక ఒడుదొడుకుల మధ్యే ముగింపు దశగా సాగుతోంది. గత రెండు సీజన్లతో పోలిస్తే ఈసారి షో రక్తి కట్టలేదన్నది స్పష్టం. పార్టిసిపెంట్లూ అనుకున్న స్థాయిలో లేరు. హోస్ట్ నాగార్జున కూడా అనుకున్న స్థాయిలో మెరవలేదన్న అభిప్రాయాలున్నాయి. ఐతే షో మరీ తీసికట్టుగా అయితే లేదు.

ఏదో ఒక మోస్తరుగా సాగిపోతోంది. షో ఇంకో నాలుగు వారాల్లోపే ముగియబోతోంది. ప్రస్తుతం హౌస్‌లో ఎనిమిది మంది పార్టిసిపెంట్లు ఉన్నారు. వచ్చే మూడు వారాల్లో వీరిలోంచి ముగ్గురు బయటికి వెళ్లనున్నారు. ఐదుగురు ఫైనల్‌కు వెళ్లబోతున్నారు. మరి ఈ మూడు వారాల్లో ఎలిమినేట్ అయ్యేదెవరు.. టైటిల్ రేసులో నిలిచేదెవరు అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.

షో పట్ల జనాల్లో ఉన్న ఫీడ్ బ్యాక్, ట్రెండ్స్ ప్రకారం చూస్తే వచ్చే మూడు వారాల్లో ఇద్దరు మగాళ్లు, ఓ అమ్మాయి బయటికి వెళ్లే అవకాశముంది. ఇప్పటిదాకా షోలో కొనసాగడమే ఎక్కువ అనే అభిప్రాయం కలిగించిన మహేష్ రాబోయే వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ వారం వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్‌లతో కలిసి అతను ఎలిమినేషన్‌లోకి వచ్చారు. మిగతా ఇద్దరూ టైటిల్‌కు గట్టి పోటీదారులు.

వాళ్లకు మహేష్‌తో పోలిస్తే మంచి ఫాలోయింగ్ ఉంది. కాబట్టి మహేష్ ఎలిమినేట్ కావడం లాంఛనమే. తర్వాతి రెండు వారాల్లో ఏదో ఒక వారం అలీ రజా ఎలిమినేట్ కావచ్చు. ఒకసారి ఎలిమినేట్ అయి తర్వాత రీఎంట్రీ ఇచ్చిన అలీ పట్ల జనాల్లో అంత పాజిటివిటీ ఏమీ లేదు. ప్రస్తుతం హౌస్‌లో మిగిలిన ముగ్గురు అమ్మాయిల్లో శ్రీముఖి ఫైనల్‌కు చేరడం లాంఛనమే అని భావిస్తున్నారు. వితిక, శివజ్యోతిల్లో ఒకరు ఎలిమినేట్ కావచ్చు.

భార్యాభర్తలిద్దరినీ ఫైనల్‌కు పంపడం బాగుండదని, వితికను బయటికి పంపొచ్చు. ఆమె పట్ల జనాల్లో నెగెటివిటీ కూడా ఉంది. బహుశా ఫైనల్ వీక్‌లో వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి, శివజ్యోతి హౌస్‌లో కొనసాగి టైటిిల్ కోసం పోటీ పడొచ్చు.
    

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English