కొత్త సినిమాల రిలీజ్ డేట్లొచ్చాయ్

కొత్త సినిమాల రిలీజ్ డేట్లొచ్చాయ్

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన భారీ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ గత వారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఆ సినిమా మరీ గొప్పగా ఆడట్లేదు. అలాగని తీసిపడేసేలా కూడా లేదు. అయితే దసరా సీజన్‌ను దాటి సినిమా నిలబడే పరిస్థితి లేకపోవడంతో ఈ వారం వదిలేసి తర్వాతి వారాలకు సినిమాలు రిలీజ్ డేట్లు ఖరారు చేసుకుంటున్నాయి.

ఈ వారం రెండు చిన్న సినిమాలు రిలీజవుతున్నాయి. అందులో ఒకటి రాకేశ్, గార్గేయి హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న ‘ఎవరికీ చెప్పొద్దు’ కాగా.. ఇంకోటి ‘ఆర్ఎక్స్ 100’ భామ పాయల్ రాజ్‌పుత్ నటించిన ‘ఆర్డీఎక్స్ లవ్’. ఆ తర్వాతి వారానికి మూడు ఆసక్తికర సినిమాలు రిలీజ్ డేట్లను ఖరారు చేసుకున్నాయి. అవి మూడు చిన్న స్థాయివే. కానీ వాటిపై ప్రేక్షకుల్లో ఓ మోస్తరుగా ఆసక్తి ఉంది.

చాన్నాళ్లుగా రిలీజ్ కోసం చూస్తున్న ఆది సాయికుమార్ సినిమా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ అక్టోబరు 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ వారానికి ముందు రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్నది ఆ చిత్రమే. ఇక రవిబాబు లేటెస్ట్ హార్రర్ థ్రిల్లర్ ‘ఆవిరి’ కూడా అదే రోజు రాబోతోంది. దీంతో పాటు మరో హార్రర్ కామెడీ మూవీ ‘రాజు గారి గది-3’ కూడాా అదే రోజు విడుదల కానున్నట్లు సమాచారం.

దసరాకే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ‘సైరా’కు పోటీగా వెళ్లడం మంచిది కాదని వాయిదా వేశారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబరు 18న రాబోయే చిత్రాల్లో  ఎక్కువ అంచనాలున్నది అనడంలో సందేహం లేదు. మరోవైపు వాయిదాల మీద వాయిదాలు పడ్డ నిఖిల్ సిద్దార్థ చిత్రం ‘అర్జున్ సురవరం’ చివరికి నవంబరు 8న రానున్నట్లు తెలుస్తోంది. దీపావళికి అనుకున్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీ మామ’ డిసెంబరు మొదటి వారానికి వాయిదా పడ్డట్లు వార్తలొస్తున్నాయి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English