వారానికే లైఫ్ టైం రికార్డులు బద్దలు

వారానికే లైఫ్ టైం రికార్డులు బద్దలు

తెలుగు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి స్థానం చెక్కుచెదరనిదని.. మరోసారి రుజువైంది. పదేళ్ల విరామం తర్వాత ‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో రీఎంట్రీ ఇస్తే ఆయనకు తెలుగు ప్రేక్షకులు ఎలా బ్రహ్మరథం పట్టారో తెలిసిందే.

దీని తర్వాత ఆయన నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా కూడా తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన ఆదరణ దక్కించుకుంటోంది. ఓవరాల్‌గా ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుంది.. తెలుగు రాష్ట్రాల అవతల పరిస్థితి ఏంటన్నది పక్కన పెడితే.. ఏపీ-తెలంగాణల్లో మాత్రం ఇప్పటిదాకా సైరా పెర్ఫామెన్స్ అదుర్స్ అనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో అనేక పెద్ద సినిమాల లైఫ్ టైం వసూళ్లను ‘సైరా’ ఒక్క వారానికే దాటేయడం అంటే మామూలు విషయం కాదు.

‘బాహుబలి-ది కంక్లూజన్’, ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘రంగస్థలం’ మినహా.. ఏపీ-తెలంగాణల్లో అన్ని సినిమాల ఫుల్ రన్ వసూళ్లను ‘సైరా’ దాటేసింది. సాహో, భరత్ అనే నేను, శ్రీమంతుడు, అరవింద సమేత, జనతా గ్యారేజ్.. ఇలా చాలా పెద్ద సినిమాల తెలుగు రాష్ట్రాల ఫుల్ రన్ షేర్‌ను ‘సైరా’ వారంలోనే అధిగమించింది.  

తొలి వారంలో ‘సైరా’ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.84 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం. ‘సైరా’ను మించిన అంచనాలతో వచ్చిన ‘సాహో’ తొలి వారంలో తెలుగు రాష్ట్రాల్లో రూ.74 కోట్ల షేరే సాధించింది. ఐతే ఆ సినిమా వసూళ్లు తొలి నాలుగు రోజుల తర్వా త ఒకేసారి బాగా డ్రాప్ అయిపోయాయి. తర్వాత ఏ దశలోనూ పుంజుకోలేదు. ‘సైరా’ అలా కాదు. వీకెండ్ తర్వాత సోమవారం కొంచెం వీక్ అయినట్లు కనిపించిన ‘సైరా’ మంగళవారం దసరా సెలవు కావడంతో మళ్లీ పుంజుకుంది.

శని, ఆదివారాలకు దీటుగా మంగళవారం వసూళ్లు వచ్చాయి. ఫస్ట్ షో, సెకండ్ షోలకు హౌస్ ఫుల్స్‌తో రన్ అయిందీ సినిమా. ఏడో రోజు షేర్ అంచనాలకు మించి వచ్చింది. వారం రోజుల్లో ‘సైరా’ వరల్డ్ వైడ్ షేర్ రూ.110 కోట్లను దాటడం విశేషం. తెలుగు వెర్షన్ వరల్డ్ వైడ్ షేర్ రూ.90 కోట్లకు చేరువగా ఉంది. ఫుల్ రన్లో తెలుగులోనే ఈ చిత్రం రూ.100 కోట్ల షేర్ మార్కును ఈజీగా దాటేసేలా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English