ఆ రుణాన్ని దిల్ రాజు ఇలా తీర్చుకుంటున్నాడా?

ఆ రుణాన్ని దిల్ రాజు ఇలా తీర్చుకుంటున్నాడా?

దిల్ రాజు అనే వ్యక్తి ఈ రోజు టాలీవుడ్లో నంబర్ వన్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్‌గా కొనసాగుతున్నాడు అంటే.. నిర్మాతగా 16 ఏళ్ల కిందట నిర్మాతగా ఆయన కెరీర్‌కు పడిన బలమైన పునాదే కారణం. వెంకటరమణా రెడ్డి అలియాస్ రాజుగా ఉన్న ఆయన పేరు వెనుక ‘దిల్’ అనే పదం చేరి అదే ఆయన ఇంటిపేరుగా మారిపోయిందంటే.. ‘దిల్’ సినిమా ఆయనకు ఎంత ప్రత్యేకమో అర్థం చేసుకోవచ్చు.

దాని కంటే ముందు రాజు డిస్ట్రిబ్యూటర్‌గా చాలా సినిమాల్ని పంపిణీ చేశాడు. కొన్ని సినిమాల్లో నిర్మాణ భాగస్వామిగా కూడా ఉన్నాడు. కానీ ఆయనకు భారీగా లాభాలు అందించి, నిర్మాతగా గుర్తింపు తెచ్చిన సినిమా ‘దిల్’యే. ‘ఆది’ లాంటి బ్లాక్‌బస్టర్‌తో దర్శకుడిగా పరిచయం అయిన వినాయక్‌కు ఆఫర్లు వెల్లువెత్తుతున్న సమయంలో రాజుకు కమిట్మెంట్ ఇచ్చి ‘దిల్’ లాంటి సూపర్ హిట్ అందించాడు. ఆ సినిమా తర్వాత రాజు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది.

వినాయక్ మీద తన అభిమానాన్ని గతంలో ఎన్నోసార్లు మాటల ద్వారా చూపించాడు రాజు. ఇప్పుడు చేతల్లో ఆ అభిమానాన్ని చూపించే సమయం వచ్చింది. వినాయక్ దర్శకుడిగా దారుణమైన స్థితిలో ఉండగా.. ఆయన్ని హీరోగా పరిచయం చేస్తూ ‘సీనయ్య’ అనే సినిమా తీస్తున్నాడు రాజు. ముందు వినాయక్ హీరో అనగానే చాలామంది ఆశ్చర్యపోయారు. ఇది జస్ట్ రూమరే అనుకున్నారు. కానీ ఈ సినిమా నిజమే అని తర్వాత తేలింది. ఇప్పుడు ఈ చిత్రం ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది.

వినాయక్ హీరో, ‘శరభ’ అనే ఊరూ పేరూ లేని సినిమా తీసిన నరసింహారావు దర్శకుడు అంటే ఎవరికైనా ఏం ఆసక్తి ఉంటుంది.  కానీ ఈ చిత్రాన్ని రాజు నిర్మిస్తున్నాడంటే కలిగే ఆసక్తి వేరు. మరే నిర్మాత అయినా ఈ కాంబినేషన్లో సినిమా తీయడానికి సందేహించేవాడేమో. కానీ వినాయక్ తనకు చేసిన మేలును గుర్తుంచుకుని ఆయన ముచ్చట తీర్చడానికి ముందుకొచ్చాడు రాజు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English