శ్రీముఖి సినిమా.. ఏం ప్లానింగబ్బా

శ్రీముఖి సినిమా.. ఏం ప్లానింగబ్బా

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. గత ఏడాది కౌశల్ మండ పక్కా ప్లానింగ్‌తో ‘బిగ్ బాస్’ షోలో అడుగు పెట్టాడన్నది వాస్తవం. షోలో అతడి యాటిట్యూడ్ నచ్చి లక్షలమంది అతణ్ని అభిమానించినప్పటికీ.. సోషల్ మీడియాలో ఫ్యాన్ గ్రూపుల్ని మేనేజ్ చేయడం, ఓటింగ్‌ను ప్రభావితం చేయడంలో కౌశల్ బ్యాక్ ఎండ్ టీం గట్టి కృషే చేసిందన్నది నిజం.

ఈసారి ఆ స్థాయిలో కాకపోయినా శ్రీముఖి పక్కా ప్లాన్‌తో షోలోకి అడుగు పెట్టిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో ఆమె పేరుతో ఉన్న అధికారిక అకౌంట్లు  చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. ఆమెను ప్రమోట్ చేయడంలో చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. ఇక షోలో కూడా ‘బిగ్ బాస్’ నిర్వాహకులు ఆమెను ఎలివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని.. హోస్ట్ నాగార్జున ఆమె పట్ల ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శలున్నాయి.

తనకున్న ఫాలోయింగ్‌ను చూపించి శ్రీముఖి కొన్ని కండిషన్ల మీద ఈ షోకు వచ్చిందనే ప్రచారం కూడా ఉంది. శ్రీముఖి ప్లానింగ్ ఎంత పర్ఫెక్ట్‌గా ఉందంటే.. ఈ షోకి రావడానికి ముందు ఆమె చడీచప్పుడు లేకుండా ఒక సినిమా పూర్తి చేసి వచ్చింది. దాని గురించి ఇప్పటిదాకా రివీల్ చేయలేదు. ఇప్పుడు ‘బిగ్ బాస్’ మూడో సీజన్‌ ముగింపు దశకు చేరుతుండగా.. ఆ సినిమా గురించి వెల్లడించారు. ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేశారు.

గౌతమ్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్ర టైటిల్ త్వరలోనే ప్రకటించనున్నారు. షో రసపట్టులో ఉన్న సమయంలో ఫస్ట్ లుక్ రివీల్ చేయడం విశేషమే. ‘బిగ్ బాస్’లో శ్రీముఖి ఫైనల్ చేరడం లాంఛనమే అని భావిస్తున్నారు. అన్నీ కలిసొస్తే ఆమె విజేత అయినా కావచ్చేమో.

ఏదేమైనా షో మొదలైన నాటి నుంచి చివరి రోజు వరకు హౌస్‌లో కొనసాగడం ద్వారా శ్రీముఖి పాపులారిటీ  పెరుగుతున్న మాట వాస్తవం. ఈ ఫాలోయింగ్‌ను సినిమా కోసం ఉపయోగించుకోవాలని శ్రీముఖి ముందే ప్లాన్ చేసుకుని వచ్చినట్లుంది. ఆమె బయటికి వచ్చే సమయానికి ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కానీ గత రెండు సీజన్లలో ‘బిగ్ బాస్’ విజేతలుగా నిలిచిన వాళ్ల ఫాలోయింగ్ ఎంతో కాలం నిలబడలేదు. వాళ్ల సినీ కెరీర్లేమీ మారిపోలేదు. మరి శ్రీముఖి దశ తిరిగిపోతుందని ఎలా అనుకోగలం?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English