బన్నీ మళ్లీ చెట్టెక్కేసాడు!

బన్నీ మళ్లీ చెట్టెక్కేసాడు!

సుకుమార్‌తో చిత్రానికి అల్లు అర్జున్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసాడని, దసరాకి షూటింగ్‌ ప్రారంభించేస్తాడని వార్తలు వచ్చాయి కానీ మరోసారి అతను చెట్టెక్కేసాడు. సుకుమార్‌ చిత్రాన్ని లాంఛనంగా కూడా మొదలు పెట్టలేదు. కారణం ఏమిటో గానీ నవంబరు నుంచే సుకుమార్‌ షూటింగ్‌కి వెళ్లిపోతానని చెబుతూ వచ్చిన అల్లు అర్జున్‌ మరోసారి ఆ చిత్రాన్ని హోల్డలో పెట్టాడు.

అలాగే 'ఐకాన్‌' చిత్రాన్ని వాయిదా వేసాడని అనుకున్నదల్లా మళ్లీ దాని గురించి చర్చలు ముమ్మరం చేసాడు. ఇటీవల 'ఐకాన్‌' అనే హ్యాట్‌ పెట్టుకుని తిరుగుతూ సుకుమార్‌పై మరింత ఒత్తిడి పెంచుతున్నాడు. సుకుమార్‌ చెప్పిన కథని ఓకే చేసిన తర్వాత ఎందుకని దానిని హోల్డ్‌లో పెట్టాడనేది తెలియదు. మరోవైపు సుకుమార్‌ మాత్రం వదలకుండా అల్లు అర్జున్‌ చుట్టూ తిరుగుతున్నాడు.

అల వైకుంఠపురములో సెట్లో తరచుగా సుకుమార్‌ కనిపిస్తున్నాడని, షాట్‌ గ్యాప్‌లో అల్లు అర్జున్‌తో సీరియస్‌గా స్క్రిప్ట్‌ డిస్కస్‌ చేస్తున్నాడని సమాచారం. మరోవైపు దిల్‌ రాజు కూడా అల్లు అర్జున్‌ని తరచుగా కలుస్తూనే వున్నాడట. సుకుమార్‌ సినిమా ఆలస్యమవుతుందనుకుంటే డిసెంబర్‌లోనే ఐకాన్‌ మొదలు పెట్టేయాలని చూస్తున్నాడట. మొత్తానికి రెండు సినిమాలు ఓకే చేసి పెట్టిన అల్లు అర్జున్‌ రెండు పార్టీలనీ కుదురుగా వుండనివ్వడం లేదు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English