సైరాకి ఎదురెళ్లి చితికిపోయాడు!

సైరాకి ఎదురెళ్లి చితికిపోయాడు!

దసరా పండుగ ఏమీ సంక్రాంతి కాదని పలుమార్లు రుజువయినా కానీ రెండు సినిమాలకి చోటు వుంటుందంటూ 'చాణక్య' చిత్రాన్ని సరిగ్గా దసరా ముందు విడుదల చేసారు. 'సైరా' తెలుగు రాష్ట్రాలలో అదరగొడుతోన్న సమయంలో అలసు ఫామ్‌లో లేని గోపిచంద్‌ చిత్రాన్ని విడుదల చేయడం అతి పెద్ద తప్పిదమయింది.

చాణక్య చిత్రానికి సోలో రిలీజ్‌ అయితే వచ్చే వసూళ్లు కూడా రాకుండా పోయాయి. చాణక్య విడుదలని కనీసం ఈ వారాంతం వరకు డిలే చేసినట్టయితే సైరా జోరు పూర్తిగా తగ్గిపోవడం వల్ల దానికి బెనిఫిట్‌ వుండేది. కానీ సైరా ఇంకా థియేటర్లలో ఫ్రెష్‌గా వుండగా దానికి ఎదురెళ్లిన చాణక్య చితికిపోయింది. అసలే కష్టాల్లో వున్న గోపిచంద్‌కి ఈ చిత్రంతో మరిన్ని కష్టాలు పెరిగాయి.

సైరాకి ఎదురు వెళ్లడం దేనికని పలువురు వారించినా కానీ మొదటి మూడు రోజుల్లో ఆ సినిమా సందడి ముగుస్తుందని, పండక్కి తమ సినిమా లాభపడుతుందని భావించారు. సైరాని తక్కువ అంచనా వేయడం, తమ చిత్రాన్ని ఎక్కువ అంచనా వేసుకోవడంతో రావాల్సిన వసూళ్లు కూడా రాక చాణక్య మేకర్లు మూల్యం చెల్లించుకున్నారు. చాణక్య కంటే హిందీ సూపర్‌హిట్‌ వార్‌ అనువాదానికే ఎక్కువ వసూళ్లు వస్తూ వుండడం పుండు మీద కారం చల్లినట్టయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English