సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో.. తెగని బేరం!

 సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో.. తెగని బేరం!

సంక్రాంతికి విడుదల కానున్న రెండు భారీ చిత్రాల మధ్య ఇంతవరకు సఖ్యత ఏర్పడలేదు. ఎవరు ఎప్పుడు రావాలనే దానిపై ఇరు వర్గాలు నిర్ణయించుకోలేదు. ఎవరు ముందు రావాలనే దానిపై ఇరు చిత్రాల నిర్మాతలు కనీసం మాట పూర్వక ఒప్పందానికి కూడా రాలేదు. మరోవైపు రెండు సినిమాల హీరోలు కూడా తగ్గడానికి సిద్ధంగా లేరు.

'సరిలేరు నీకెవ్వరు' పోస్టర్‌ రిలీజ్‌ చేస్తున్నారని తెలియగానే వెంటనే 'అల వైకుంఠపురములో' పోస్టర్‌ విడుదల చేసారు. సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని ఒత్తిడిలో పెట్టడానికి మూడు నెలలకి ముందుగానే అల వైకుంఠపురములో చిత్రంలోని సూపర్‌హిట్‌ సాంగ్‌ వదిలేసారు. ఒక చిత్రానికి దిల్‌ రాజు, మరో చిత్రానికి అల్లు అరవింద్‌ లాంటి పెద్ద తలకాయలు వుండడంతో ఈ వివాదాన్ని తేల్చడానికి ఇండస్ట్రీ పెద్దలెవరూ జోక్యం చేసుకోవడం లేదు.

చూస్తోంటే ఈ రెండు చిత్రాలు జనవరి 11 లేదా జనవరి 12నే విడుదలవుతాయని కూడా ట్రేడ్‌ వర్గాల వారు భావిస్తున్నారు. ఒకే రోజున రెండు భారీ చిత్రాలు విడుదల కావడం వల్ల ఎవరికీ అడిషినల్‌ అడ్వాంటేజ్‌ వుండదు. దేనికి మంచి టాక్‌ వస్తే అదే క్లిక్‌ అవుతుంది. ఒకవేళ రెండూ బాగున్నాయంటే పండగ రెవెన్యూ రెండూ షేర్‌ చేసుకుంటాయి. ఇందుకోసం రెండు చిత్రాల బిజినెస్‌ కూడా సమాన స్థాయిలో జరగాల్సి వుంటుంది మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English