హీరోలని వదిలి డైరెక్టర్ల వెంట పడుతున్నాడు

 హీరోలని వదిలి డైరెక్టర్ల వెంట పడుతున్నాడు

నిన్న మొన్నటి వరకు తనతో సినిమా చేయమని హీరోల వెంట పడిన దర్శకుడు వినాయక్‌ ఇక రూటు మార్చేసాడు. త్వరలో దిల్‌ రాజు సినిమా 'సీనయ్య'లో టైటిల్‌ రోల్‌లో కనిపించబోతున్న వినాయక్‌ ఇక దర్శకత్వం పక్కన పడేసి నటుడిగా బిజీ కావాలని చూస్తున్నాడు.

ఇంతకాలం హీరోలని వెంటాడిన వినాయక్‌ ఇప్పుడు దర్శకులని తనకోసం పాత్రలు సృష్టించమని అడుగుతున్నాడు. మామూలుగా వినాయక్‌ బర్త్‌డేకి అతని దర్శకత్వంలో రాబోయే చిత్రాల యాడ్‌లు మాత్రమే వచ్చేవి. కానీ ఈసారి అతడికి నటుడిగా శుభాకాంక్షలు చెబుతూ యాడ్స్‌ ఇచ్చారు.

 వీటిలో చాలా వరకు సెల్ఫ్‌ ప్రమోషన్‌ యాడ్సే అనుకోండి. తనని నటుడిగా గుర్తించమని వినాయక్‌ ఇలా అందరికీ విన్నవించుకుంటున్నాడు. ఇరవై కేజీల బరువు తగ్గి, మంచి విగ్గు పెట్టుకుని ఇక మీదట నటుడిగా టాలెంట్‌ చూపించాలని వినాయక్‌ ఫిక్స్‌ అయ్యాడు. గతంలో చాలా మంది దర్శకులు ఇలా నటులుగా టర్న్‌ తీసుకున్నవారే.

తమిళంలో అయితే నటులుగా మారిన దర్శకులు చాలా మందే వున్నారు. వినాయక్‌ కూడా వారి బాటలో ఇప్పుడు నటుడైపోయాడు. సీనయ్య హిట్టయితే ఇకమీదట వినాయక్‌తో సినిమాలు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలయితే లేకపోలేదు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English