సైరా నరసింహారెడ్డి రికార్డు కొట్టి చూపించాడు!

సైరా నరసింహారెడ్డి రికార్డు కొట్టి చూపించాడు!

తెలుగు రాష్ట్రాలలో సాహో సాధించిన వసూళ్లని ఆరు రోజులోనే సైరా నరసింహారెడ్డి అధిగమించాడు. తొలి వారం వసూళ్లలో బాహుబలి 2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన ఘనత ఈ చిత్రంతో చిరంజీవి అందుకున్నారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల షేర్‌ మార్కుని ఏడవ రోజున అధిగమించింది. తద్వారా ఖైదీ నంబర్‌ 150 ఫుల్‌ రన్‌ షేర్‌ని అధిగమించి చిరంజీవి ఖాతాలో హయ్యస్ట్‌ గ్రాసర్‌గా నిలిచింది.

ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలోనే వంద కోట్లకి పైగా షేర్‌ సాధించిన చిత్రంగా నిలవడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. ఇంతవరకు బాహుబలి చిత్రాలకి తప్ప ఆ ఘనత మరే చిత్రానికీ దక్కలేదు. ఓవరాల్‌గా 'రంగస్థలం' వసూళ్లని తెలుగు వెర్షన్‌తోనే దాటుతుందని కూడా ట్రేడ్‌ అంచనా వేస్తోంది. రెండవ వారంలో పోటీనిచ్చే సినిమా ఏదీ లేకపోవడం, మరి కొన్ని వారాల వరకు పెద్ద సినిమాలేవీ రాకపోవడం వల్ల సైరా నరసింహారెడ్డికి లాంగ్‌ రన్‌ వుంటుందని ట్రేడ్‌ ప్రిడిక్ట్‌ చేస్తోంది.

తెలుగు రాష్ట్రాలలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో సైరా వసూళ్లు చాలా నిలకడగా వున్నాయి. దసరా రోజున మరోసారి ఈ చిత్రానికి అద్భుతమైన వసూళ్లు వచ్చాయి. దీంతో సెకండ్‌ వీకెండ్‌ కూడా సాలిడ్‌గా వుంటుందని భావిస్తున్నారు. తెలుగు వెర్షన్‌ వరకు 'నాన్‌-బాహుబలి' రికార్డు రావడమయితే పక్కా అనే అంటున్నారు. రీఎంట్రీలో వరుసగా రెండు వంద కోట్ల షేర్‌ తెచ్చిన చిత్రాలతో చిరంజీవి తన సత్తా ఏమిటనేది చూపించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English