చిరంజీవి-కొరటాల సినిమాలో రామ్‌ చరణ్‌!

చిరంజీవి-కొరటాల సినిమాలో రామ్‌ చరణ్‌!

చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో పూజా కార్యక్రమం జరుపుకున్న చిత్రానికి సంబంధించి ఒక మెగా సీక్రెట్‌ దాచి పెట్టినట్టు వినిపిస్తోంది. ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ కూడా నటిస్తున్నాడని, అది కేవలం అతిథి పాత్ర లేక ప్రత్యేక పాత్ర కాదని, ఈ చిత్రాన్ని పూర్తి స్థాయి మల్టీస్టారర్‌గా తీర్చిదిద్దుతున్నారని సమాచారం. మరి చిరంజీవితో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటాడా లేక చిరంజీవి యంగ్‌గా వున్నప్పటి పాత్రలో చరణ్‌ కనిపిస్తాడా అనేదానిపై స్పష్టత లేదు.

సైరా ఇంటర్వ్యూలలో భాగంగా చరణ్‌తో కలిసి త్వరలోనే మల్టీస్టారర్‌ చేస్తున్నట్టు చిరంజీవి ప్రకటించారు. అయితే అది ఏ చిత్రమనేది చిరంజీవి చెప్పలేదు. కొరటాల శివ సినిమాతోనే అభిమానుల కోరిక తీరిపోనుందని తెలిసింది. చరణ్‌ ప్రస్తుతానికి ఎన్టీఆర్‌, రాజమౌళితో చేస్తోన్న 'ఆర్‌.ఆర్‌.ఆర్‌'తో బిజీగా వున్నాడు. ఆ సినిమా కోసమని చరణ్‌ గుబురు మీసాలు పెంచుకున్నాడు.

ఈ చిత్రానికి తన పని మొదలు పెట్టాలంటే ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ పూర్తవ్వాలి. ఈలోగా చిరంజీవిపై దృశ్యాలని ఫినిష్‌ చేస్తారని, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్ట్‌కి రిలీజ్‌కి సిద్ధ చేస్తారని సమాచారం. ఈసారి చరణ్‌ పూర్తిగా నిర్మాణ బాధ్యతలు మోయకుండా వేరే నిర్మాతతో కలిసి నిర్మాణం చేపట్టాడు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English