వారం రోజుల్లో రెండొందల కోట్లు

వారం రోజుల్లో రెండొందల కోట్లు

హృతిక్‌ రోషన్‌ తన కటౌట్‌కి తగ్గ సినిమాలు చేయక గానీ లేదంటే ఖాన్‌ త్రయాన్ని ఎప్పుడో దాటేసేవాడు. పర్‌ఫార్మెన్స్‌ బేస్డ్‌ పాత్రల మీద ఆసక్తితో తన బలాలని విస్మరిస్తూ వచ్చిన హృతిక్‌ చాలా కాలానికి తన స్టయిల్‌కి, స్క్రీన్‌ ప్రెజన్స్‌కి తగ్గ సినిమా చేసాడు. దాంతో జనం వెర్రెత్తిపోయి సినిమా చూస్తున్నారు. హృతిక్‌కి టైగర్‌ ష్రాఫ్‌ జత కలవడం, చక్కని యాక్షన్‌ సన్నివేశాలు తోడవడంతో 'వార్‌' బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టిస్తోంది.

వారం రోజుల్లోనే ఇండియాలో నెట్‌ వసూళ్లు రెండు వందల కోట్లు వచ్చాయి. ఇంత వేగంగా రెండు వందల కోట్ల మార్కుకి రీచ్‌ అయిన చిత్రం ఈ ఏడాదిలో మరోటి లేదంటే హృతిక్‌ బీభత్సం ఎలా వుందనేది అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాదిలో ఇంతవరకు బాలీవుడ్‌ నుంచి మూడు వందల కోట్ల నెట్‌ వసూలు చేసిన సినిమా రాలేదు. ఆ లోటుని వార్‌ తీర్చేయనుంది. ఇది హృతిక్‌ రోషన్‌ ఖాతాలో తొలి రెండు వందల కోట్ల చిత్రమే కాకుండా, మూడు వందల క్లబ్‌లో కూడా అతనికి చోటు ఇవ్వనుంది.

సల్మాన్‌ ఖాన్‌ హవా కాస్త తగ్గిన టైమ్‌లో, షారుక్‌ ఖాన్‌ కనుమరుగు అవుతోన్న దశలో, ఆమిర్‌ ఖాన్‌ కూడా సక్సెస్‌ ఫార్ములా మిస్‌ అయిన తరుణంలో హృతిక్‌ పుంజుకోవడంతో అభిమానులు ఆనందం పట్టలేకపోతున్నారు. కంగన రనౌత్‌ చేసిన ఇమేజ్‌ డ్యామేజ్‌ వల్ల కొంతకాలం పర్సనల్‌గా ఇబ్బందులు పడ్డ హృతిక్‌కి ఇప్పుడు వార్‌తో అన్ని కష్టాలు తీరిపోయినట్టే. ఇక మీదట అతను ఇలాంటి పాత్రలకే కట్టుబడి వుంటాడని ఫాన్స్‌, ట్రేడ్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English