'సరిలేరు'పై అంచనాలు పెంచేసిన అనిల్

'సరిలేరు'పై అంచనాలు పెంచేసిన అనిల్

పెద్ద హీరోల సినిమాలు మేకింగ్ దశలో ఉన్నపుడు దర్శకులు పెద్దగా మాట్లాడరు. విశేషాలు పంచుకోవడానికి ఇష్టపడరు. సైలెంటుగా పని చేసుకుని పోతుంటారు. కానీ మహేష్ బాబుతో తొలిసారి జట్టు కట్టిన యువ దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నాడు.

ఈ సనిమాపై ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తూ.. సినిమా విశేషాలు పంచుకుంటూ అభిమానుల్లో అంచనాలను పెంచేస్తున్నాడు. దసరా సందర్భంగా అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఒక మాస్ పోస్టర్‌తో మురిపించిన అనిల్.. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ అభిమాలకు మరింత ఆనందాన్నిచ్చే మాటలు చెప్పాడు. 'సరిలేరు నీకెవ్వరు' మహేష్ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులకు కూడా ఒక ఫీస్ట్ అని అనిల్ చెప్పడం విశేషం.

తాను ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఈ మాట చెప్పడం లేదని.. కచ్చితంగా 'సరిలేరు..ప్రేక్షకులకు ఒక విందే అని అనిల్ ధీమా వ్యక్తం చేశాడు. సినిమాలో కావాల్సినంత కామెడీ ఉంటుందని.. ప్రేక్షకులు బాగా నవ్వుకోవచ్చని.. దాంతో పాటుగా హృదయాల్ని టచ్ చేసే ఒక మంచి కాన్సెప్ట్ కూడా ఉంటుందని.. కథాబలం ఉన్న సినిమా ఇదని అనిల్ అన్నాడు.

మహేష్ బాబు పెర్ఫామెన్స్‌తో పాటు విజయశాంతి ప్రెజెన్స్.. మహేష్-రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్లో వచ్చే సీక్వెన్స్ సినిమాలో హైలైట్లుగా ఉంటాయన్నాడు. రత్నవేలు టాప్ క్లాస్ ఛాయాగ్రహణం అందించాడని.. విజువల్స్ చాలా బాగుంటాయని.. పండక్కి ప్రేక్షకులు ఎలాంటి సినిమా కోరుకుంటారో అలా 'సరిలేరు..' ఉంటుందని అనిల్ ధీమా వ్యక్తం చేశాడు.

ఈ ఏడాది సంక్రాంతికి 'ఎఫ్-2'కు ఫ్యామిలీ అంతా వచ్చి ఎలా ఎంజాయ్ చేశారో.. వచ్చే సంక్రాంతికి కూడా కుటుంబ ప్రేక్షకులు అలాగే వచ్చి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాను ఆస్వాదించవచ్చని అనిల్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English