విద్యా బాలన్‌ రేంజ్‌లో చెయ్యట్లేదట

విద్యా బాలన్‌ రేంజ్‌లో చెయ్యట్లేదట

అందం, అభినయం, పుష్కలంగా ఆకర్షణ ఉన్న కథానాయికగా నయనతారకు పేరుంది. అయితే అది అందం తెచ్చిన ఆకర్షణా.., లేదా ఆకర్షణ దాచేసిన అభినయమా ఎవరికీ తెలియదు. నయన్‌ గొప్ప నాయిక అనుకునేవారంతా, ఈ బ్యూటీని వేరే కోణంలో విశ్లేషిస్తే...కేవలం గ్లామర్‌ని రంగరించి ఏవో నాలుగైదు ఎక్స్‌ప్రెషన్‌తో కెరీర్‌ని ఇంత పీక్‌కి తెచ్చేసింది తప్ప అభినయించిందేం లేదని అనిపిస్తుంది. కేవలం గ్లామర్‌ మినహా పూర్తిస్థాయిలో అభినయించే రోల్‌ ఇంతవరకూ ఈ అమ్మడు చేయనేలేదు.

ఇటీవలి ‘శ్రీరామరాజ్యం’లో సైతం సీతగా ఓచోట కూచొని ఏడుపుగొట్టు సీన్లు చేయడం తప్ప పొడిచేసిందేం లేదు. సీతకి డబ్బింగ్‌ చెప్పిన సునీత సుమధురగళం పుణ్యమా అని గుర్తింపొచ్చిందంతే. ప్రస్తుతం శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో ‘అనామిక’గా నయన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది విద్యాబాలన్‌ ‘కహానీ’కి రీమేక్‌. అయితే అక్కడ విద్యా చూపించినన్ని ఎక్స్‌పప్రెషన్స్‌ని చూపించలేక ఆపసోపాలు పడుతోందిట నయన్‌. అమ్మడి వ్యవహారం దర్శకుడు శేఖర్‌ కమ్ములకి తలనొప్పి తెస్తోందిట. ఇక సినిమా రిలీజైతే కాని అసలు సీనేంటనేది మనకి తెలస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు