చిరు మైలురాయిని అందుకున్నాడు, కానీ...

చిరు మైలురాయిని అందుకున్నాడు, కానీ...

మెగాస్టార్ చిరంజీవి సినిమా సైరా న‌ర‌సింహారెడ్డి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఒక్కో మైలురాయిని దాటుతూ సాగుతోంది. ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ రూ.100 కోట్ల మార్కును అందుకోవ‌డం విశేషం. అమెరికాలో 2 మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్బులోకి కూడా ఈ సినిమా అడుగు పెట్టింది. ప‌దేళ్ల విరామం త‌ర్వాత సినిమాల్లోకి తిరిగొచ్చిన చిరు.. రీఎంట్రీలో చేసిన తొలి సినిమాతోనే రూ.100 కోట్ల షేర్ మార్కును అందుకున్నాడు.

కానీ ఆ సినిమా థియేట్రిక‌ల్ ర‌న్ చివ‌రి ద‌శ‌లో ఈ మైలురాయిని ట‌చ్ చేసింది. సైరా న‌ర‌సింహారెడ్డి ఆరో రోజుకే వంద కోట్ల షేర్ క్ల‌బ్బును అందుకుంది. అయితే ఇందులో మేజ‌ర్ షేర్ తెలుగు రాష్ట్రాల నుంచే వ‌చ్చింది. ఏపీ, తెలంగాణ‌ల్లో క‌లిపి సైరా రూ.70 కోట్ల షేర్ రాబ‌ట్ట‌డం విశేషం. మిగ‌తా షేర్‌లో ప్ర‌ధాన వాటా క‌ర్ణాట‌క‌దే.

ఆ  రాష్ట్రంలో సైరా రూ.11.5 కోట్ల షేర్ రాబ‌ట్టింది ఇప్ప‌టిదాకా. త‌మిళ‌నాడు, కేర‌ళ‌ల్లో క‌లిపి రూ.2 కోట్ల దాకా షేర్ రాగా.. హిందీ వెర్ష‌న్ ఉత్త‌రాది రాష్ట్రాల్లో రూ.4 కోట్ల‌కు పైగానే షేర్ రాబ‌ట్టింది. అమెరికాలో ఈ చిత్రం 2 మిలియ‌న్ల గ్రాస్.. రూ.7.5 కోట్ల షేర్ వ‌సూలు చేసింది.

అయితే ఇప్ప‌టిదాకా ప‌రిస్థితి ఎంత ఆశాజ‌న‌కంగా ఉన్నా.. చాలా వేగంగానే రూ.100 కోట్ల షేర్ మార్కును సైరా అందుకున్నా.. ఈ చిత్రం ప్ర‌యాణించాల్సిన దూరం ఇంకా చాలానే ఉంది.

రూ.190 కోట్ల‌కు పైగా షేర్ రాబ‌డితేనే సైరా హిట్ కేటగిరీని చేరుకుంటుంది. కానీ ప్ర‌స్తుత ట్రెండ్ చూస్తుంటే ఈ సినిమా రూ.150 కోట్ల మార్కును అందుకోవ‌డ‌మూ క‌ష్ట‌మే అనిపిస్తోంది. చాలా బాగా ఆడుతున్న‌ట్లు క‌నిపిస్తున్న‌ తెలుగు వెర్ష‌న్ సైతం చివ‌రికి బ‌య్య‌ర్ల‌కు న‌ష్టాలే మిగిల్చేలా క‌నిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English