రాజమౌళి బ్రాండ్‌ అయినా సేల్‌ అవుతుందా?

రాజమౌళి బ్రాండ్‌ అయినా సేల్‌ అవుతుందా?

బాహుబలి చిత్రంతో ప్రభాస్‌కి వచ్చిన క్రేజ్‌ సాహోకి హిందీ మార్కెట్లో హెల్పయింది. ఆ చిత్రాన్ని అక్కడి మీడియా దారుణంగా తొక్కేయాలని చూసినా కానీ బాహుబలిని యాక్షన్‌ హీరోగా చూడ్డానికి అక్కడి జనాలు ముచ్చట పడడంతో సాహోకి వారం రోజుల పాటు ఎదురు లేకుండా పోయింది.

అయితే సైరా విషయంలో మాత్రం అసలు దానికి అటెన్షన్‌ లభించకుండా అక్కడి మీడియా ప్రముఖులు జాగ్రత్త పడ్డారు. ఇలా దక్షిణాది సినిమాలు, దర్శకులని ఎంకరేజ్‌ చేయకూడదనేది బాలీవుడ్‌లో ఇటీవల బాగా కనిపిస్తోంది. దక్షిణాది డామినేషన్‌ని వాళ్లు హర్షించడం లేదనిపిస్తోంది. ఈ నేపథ్యంలో 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రానికి అక్కడి మీడియా నుంచి ఎంత సహకారం లభిస్తుందనేది చూడాలి.

మీడియా ఇంటరాక్షన్స్‌ టైమ్‌లో మనవాళ్లు ఇచ్చే తాయిలాలు అన్నీ తీసేసుకుంటోన్న అక్కడి సమీక్షకులు, మీడియా ప్రముఖులు తీరా సినిమా విడుదలయ్యాక ముఖం చాటేయడం లేదా ఏకి పారేయడం చేస్తున్నారు. మరి బాహుబలి తీసిన దర్శకుడనే కారణంగా రాజమౌళికి అయినా తగిన రెస్పెక్ట్‌ ఇచ్చి ఆర్‌ఆర్‌ఆర్‌కి దక్కాల్సిన స్పేస్‌ ఇస్తారా లేక అక్కడి ప్రముఖుల ఆజ్ఞలకి అణుగుణంగా నడుచుకుంటారా?

ఏదేమైనా ప్రస్తుత ట్రెండ్‌ని బట్టి ఇక తెలుగు లేదా ఇతర భాషల చిత్రాలకి బాలీవుడ్‌ నుంచి తగిన సహకారం అయితే అందేట్టు లేదు. ఇందుకోసమయినా రాజమౌళి తన చిత్రాన్ని కరణ్‌ జోహార్‌ లాంటి పెద్ద తలకాయ చేతిలో పెట్టక తప్పదు. మిగతా వారికి యష్‌రాజ్‌, ధర్మా ప్రొడక్షన్స్‌ లాంటి వాళ్లని తట్టుకునే సామర్ధ్యం లేదు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English