ఇదో మెగా ఫ్లాప్‌ కాంబినేషన్‌!

ఇదో మెగా ఫ్లాప్‌ కాంబినేషన్‌!

సాయి ధరమ్‌ తేజ్‌ తన పేరులో ధరమ్‌ పెట్టుకోవడానికి మరోసారి ఆసక్తి చూపించలేదు. సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌లో పూర్తి పేరు కొనసాగిస్తున్నా కానీ కొత్త సినిమా పోస్టర్‌లో సాయి తేజ్‌ అనే వేసుకున్నాడు. 'సోలో బ్రతుకే సో బెటర్‌' అనే ఈ టైటిల్‌కి మంచి స్పందనే వస్తోంది. కొత్త దర్శకుడు సుబ్బు పరిచయం అవుతోన్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇది పలువురి దృష్టిని ఆకర్షించింది.

ఎందుకంటే ఇంతవరకు తేజ్‌, తమన్‌ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ అట్టర్‌ ఫ్లాపయ్యాయి. తమన్‌ కొన్ని మంచి పాటలే ఇచ్చినా కానీ తిక్క, విన్నర్‌, జవాన్‌, ఇంటిలిజెంట్‌ అన్నీ బాక్సాఫీస్‌ వద్ద పల్టీ కొట్టాయి. కానీ మరోసారి తమన్‌తోనే తేజ్‌ పని చేస్తున్నాడు. విశేషం ఏమిటంటే మారుతితో చేస్తోన్న ప్రతిరోజు పండగే చిత్రానికి కూడా తమనే సంగీతం అందిస్తున్నాడు.

సెంటిమెంటుతో పేరులోంచి ధరమ్‌ని తీసేసిన సాయి తేజ్‌ మరి తమన్‌ సెంటిమెంటుకి ఎందుకు భయపడడం లేదో మరి. చిత్రలహరితో ఒక మాదిరి ఉపశమనం పొందిన సాయి తేజ్‌ 'ప్రతిరోజు పండగే'తో క్లీన్‌ హిట్‌ సాధిస్తాననే నమ్మకంతో వున్నాడు. మినిమం గ్యారెంటీ సినిమాలు తీసే బన్నీ వాస్‌, యువి క్రియేషన్స్‌ కలిసి చేస్తోన్న చిత్రం కనుక దీనిపై ట్రేడ్‌లో కూడా ఆసక్తి బాగానే వుంది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English