ఆ హీరో కెరీర్‌కిది మామూలు దెబ్బ కాదు

ఆ హీరో కెరీర్‌కిది మామూలు దెబ్బ కాదు

అస‌లే గోపీచంద్ మార్కెట్ బాగా దెబ్బ తినేసి ఉంది. అత‌ను చివ‌ర‌గా ఎప్పుడు హిట్టు కొట్టాడో కూడా జ‌నాల‌కు గుర్తు లేదు. స‌క్సెస్ కోసం ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసి విఫ‌ల‌మ‌య్యాడు ఈ యాక్ష‌న్ హీరో. కెరీర్లో 25వ సినిమా అంటూ గత ఏడాది పంతంతో ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించాడు.

ఈ మైల్ స్టోన్ మూవీలో ఏదైనా ప్ర‌త్యేక‌త ఉంటుందేమో అనుకుంటే.. అలాంటిదేమీ క‌నిపించ‌లేదు. రొటీన్ మ‌సాలా సినిమా కావ‌డంతో ప్రేక్ష‌కులు తిప్పి కొట్టారు. ఇప్పుడు త‌మిళ ద‌ర్శ‌కుడు తిరుతో చేసిన చాణ‌క్య‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు గోపీ. ఏరికోరి త‌మిళ ద‌ర్శ‌కుడితో సినిమా చేశాడంటే ఇదైనా ప్ర‌త్యేకంగా ఉంటుంద‌నుకున్నారు. కానీ ఆ ఆశ‌లు కూడా అడియాస‌లే అయ్యాయి.

ద‌స‌రా సీజ‌న్లో రిస్క్ చేసి సైరా న‌ర‌సింహారెడ్డికి పోటీగా చాణ‌క్య‌ను రిలీజ్ చేస్తే గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. ఈ సినిమాను జ‌నాలు అస‌లు ప‌ట్టించుకోలేద‌న‌డానికి పేల‌వ‌మైన అడ్వాన్స్ బుకింగ్స్ నిద‌ర్శ‌నం. దీనికి తోడు రిలీజ్ రోజు బ్యాడ్ టాక్ రావ‌డంతో చాణ‌క్య‌కు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘోర‌మైన అనుభ‌వం ఎదురైంది. గ‌త ప‌దేళ్ల‌లో గోపీచంద్ ఏ సినిమాకూ లేని విధంగా కేవ‌లం రూ.1.2 కోట్ల షేర్ మాత్ర‌మే వ‌చ్చింది ఈ చిత్రానికి. రిలీజ్ రోజే ప‌రిస్థితి ఇలా ఉంటే.. ఇక త‌ర్వాత ఎలా ఉంటుందో అంచ‌నా వేయొచ్చు. ఆదివారం కోటి రూపాయ‌ల షేర్ వ‌చ్చినా గొప్పేనేమో.

ఇక సోమ‌వారం నుంచి సినిమా మీద ఆశ‌లు వ‌దులుకోక త‌ప్పేలా లేదు. రూ.12 కోట్ల షేర్ సాధిస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే చాణ‌క్య అందులో మూడో వంతు వెన‌క్కి తేవ‌డం కూడా క‌ష్టంగానే ఉంది. ఈ చిత్రం గోపీ కెరీర్‌ను మామూలు దెబ్బ కొట్టేలా లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English