ప్రభాసే అంత చేస్తే.. చిరు ఇంకెంత చేసుండాలి?

ప్రభాసే అంత చేస్తే.. చిరు ఇంకెంత చేసుండాలి?

‘సైరా నరసింహారెడ్డి’కి ఉత్తరాదిన చాలా మంచి టాక్ వచ్చింది. హిందీ క్రిటిక్స్ అందరూ ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలిచ్చారు. హిందీ ప్రేక్షకుల్ని మెప్పించే మాస్ అంశాలకు ఇందులో లోటు లేదు. పైగా అమితాబ్ బచ్చన్ కూడా ఇందులో ఓ కీలక పాత్ర చేశారు. అయినా ఈ సినిమా ఉత్తరాదిన ఆడట్లేదు. ఓపెనింగ్స్ మరీ పేలవంగా వచ్చాయి. సినిమా ఏ దశలోనూ పుంజుకోలేదు. మరి తప్పెక్కడ జరిగిందన్నది అర్థం కావడం లేదు. దీనికి ప్రధానంగా అందరూ నిందిస్తున్నది నిర్మాణ సంస్థనే.

ప్రమోషన్లను మరీ లైట్ తీసుకోవడం సినిమాకు చేటు చేసిందన్నది అందరూ చెబుతున్న మాట. ముంబయికి చెందిన మనోజ్ దేశాయ్ అనే ఒక ప్రముఖ ఎగ్జిబిటర్.. సినిమాకు టాక్ బాగున్నప్పటికీ ప్రమోషన్లు లేకపోవడం వల్లే ‘సైరా’కు ఆదరణ లేదని విశ్లేషించాడు.

చిరంజీవి 20 ఏళ్ల కిందటే ‘ప్రతిబంద్’, ‘ఆజ్ కా గూండారాజ్’ లాంటి సినిమాలతో తన లాంటి వాళ్లను ఆకట్టుకున్నాడని.. కానీ ఇప్పటి ప్రేక్షకులకు ఆయనెవరో తెలియదని.. ప్రమోషన్లు గట్టిగా చేసి ఉంటే సినిమాకు వచ్చిన టాక్‌కు మంచి ఫలితం వచ్చేదని అన్నాడాయన.

స్వయంగా మెగా అభిమానులే ప్రమోషన్ల విషయంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీని నిందిస్తున్నారు. ప్రభాస్‌కు ‘బాహుబలి’తో ఉత్తరాదిన తిరుగులేని ఫాలోయింగ్ వచ్చినప్పటికీ.. అతను ‘సాహో’ను హిందీ మార్కెట్లో చాలా అగ్రెసివ్‌గా ప్రమోట్ చేశాడు. పదుల సంఖ్యలో ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అనేక టీవీ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.

అది కలిసొచ్చి ‘సాహో’కు నెెెగెటివ్ టాక్ వచ్చినా తట్టుకుని హిందీలో భారీ వసూళ్లు సాధించింది. ప్రభాసే అలా చేసినపుడు.. ఈ తరం ప్రేక్షకులకు అసలు పరిచయమే లేని చిరు ఇంకెంత చేసి ఉండాలి.. రామ్ చరణ్ అండ్ టీం ఉత్తరాదిన సినిమాను ెంత అగ్రెసివ్‌గా ప్రమోట్ చేసి ఉండాలి అనే ప్రశ్న తలెత్తుతోంది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English