ప‌ది సంవ‌త్స‌రాల్లో న‌య‌న్ తొలి ఇంట‌ర్వ్యూ

ప‌ది సంవ‌త్స‌రాల్లో న‌య‌న్ తొలి ఇంట‌ర్వ్యూ

30 ఏళ్లు పైబ‌డితే హీరోయిన్ల కెరీర్‌కు కౌంట్ డౌన్ మొద‌లైన‌ట్లే. గ్రాఫ్ త‌గ్గ‌డ‌మే త‌ప్ప పెర‌గ‌డం ఉండ‌దు. కానీ న‌య‌న‌తార మాత్రం ఇందుకు భిన్నం. ఆమె కెరీర్ పీక్స్‌కు వెళ్లింది థ‌ర్టీస్‌లోనే. అంత‌కంత‌కూ ఆమె డిమాండ్ పెరుగుతోంది త‌ప్ప త‌గ్గ‌ట్లేదు. ఒక సినిమాకు రూ.5 కోట్ల పారితోష‌కం అందుకుని దేశంలోనే హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ అనిపించుకుందామె. మిగ‌తా హీరోయిన్ల‌లా సినిమాను ప్ర‌మోట్ చేయ‌దు.

సోష‌ల్ మీడియాలోనూ క‌నిపించ‌దు. అయినా ఆమె డిమాండ్ మామూలుగా లేదిప్పుడు. సినిమాను ప్ర‌మోట్ చేయ‌క‌పోవ‌డ‌మే కాదు.. మీడియాకు ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డం కూడా న‌య‌న్‌కు అల‌వాటు లేదు. వ్య‌క్తిగ‌త విష‌యాల గురించి కూడా ఎక్క‌డా మాట్లాడ‌దు.

ఐతే న‌య‌న్ తాజాగా వోగ్ మ్యాగ‌జైన్ కోసం ఒక స్పెష‌ల్ ఫొటో షూట్ చేసి దాని క‌వ‌ర్ పేజీకి ఎక్క‌డ‌మే కాదు.. ఆ మ్యాగ‌జైన్‌కు ఒక ఇంట‌ర్వ్యూ కూడా ఇచ్చింది. ఈ సంద‌ర్భంగానే తాను మీడియాకు ప‌దేళ్లుగా ఒక్క ఇంట‌ర్వ్యూ కూడా ఇవ్వ‌లేద‌ని స్వ‌యంగా వెల్ల‌డించింది. మీరెందుకు ఇంత రిజ‌ర్వ్డ్‌గా ఉంటూ మీడియాకు కూడా దూరంగా ఉంటార‌ని న‌య‌న్‌ను అడిగితే.. అవును. ప‌దేళ్ల‌లో ఇదే నా తొలి ఇంట‌ర్వ్యూ. నేనేం ఆలోచిస్తున్నానో జ‌నాల‌కు తెలియాల్సిన అవ‌స‌రం లేదు.

నా వ్య‌క్తిగ‌త విష‌యాలు ఎవ‌రితోనూ పంచుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌ను. సినిమాల్లో న‌టించ‌డ‌మే నా ప‌ని. మిగ‌తా విష‌యాలు ప‌ట్టించుకోను. నాకంటూ కొన్ని పాల‌సీలు, ఫిలాస‌ఫీలు ఉన్నాయి. వాటికి అనుగుణంగానే న‌డుచుకుంటా అని తేల్చి చెప్పేసింది న‌య‌న్. మ‌రోవైపు అగ్ర క‌థానాయిక‌గా మారినందుకు త‌న‌కు ఎలాంటి గ‌ర్వం లేద‌ని.. పైగా భ‌యం ఉంద‌ని.. త‌న‌పై జ‌నాలు పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటానో లేదో అని భ‌య‌ప‌డుతుంటాన‌ని న‌య‌న్ చెప్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English