చిరంజీవి తర్వాత అతనికే, ఎందుని?

చిరంజీవి తర్వాత అతనికే, ఎందుని?

'సైరా నరసింహారెడ్డి'లో చిరంజీవిది ప్రధాన పాత్ర అయినా పలు భాషలకి చెందిన ప్రముఖ నటులకి కీలక పాత్రలు ఇచ్చారు. పాన్‌ ఇండియా అప్పీల్‌ కోసమని ఈ చిత్రంలో అమితాబ్‌, విజయ్‌ సేతుపతి, సుదీప్‌, జగపతిబాబు తదితరులకి కీలక పాత్రలు భారీ పారితోషికం ఇచ్చి మరీ చేయించుకున్నారు.

అయితే వీరందరిలోను కన్నడ స్టార్‌ సుదీప్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలిసింది. మిగిలిన వారికంటే ఎందుకని సుదీప్‌కి ఎక్కువ పాత్రనిచ్చారంటే, తెలుగు రాష్ట్రాల తర్వాత సైరాకి కర్నాటకలోనే ఎక్కువ ఆదరణ వుంటుంది. బిజినెస్‌ పరంగా చూసినా కానీ తెలుగు రాష్ట్రాల తర్వాతి స్థానం కర్నాటకదే. ఈసారి కన్నడలో కూడా అనువదించి విడుదల చేస్తున్నారు కనుక లోకల్‌ ఆడియన్స్‌ని ఆకట్టుకోవడానికి సుదీప్‌ పాత్రకి తగినంత ప్రాధాన్యం కల్పించారట.

మిగిలిన నటులు చేసిన పాత్ర కంటే సుదీప్‌ పాత్ర హైలైట్‌ అవుతుందని, పోరాట దృశ్యాలలో కూడా సుదీప్‌ క్యారెక్టరే ఎక్కువ ఎలివేట్‌ అవుతుందని సమాచారం. ఈగ సినిమా ద్వారా తెలుగువారికి దగ్గరయిన సుదీప్‌ ఇటీవల పహిల్వాన్‌గా వచ్చి ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు కానీ ఫలించలేదు. అతని సినిమాకి తెలుగునాట ఆదరణ లేకపోయినా సైరాకి కర్నాటక రాష్ట్రంలో సుదీప్‌ ప్లస్‌ అయ్యేలా వున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English