రష్మికను డమ్మీని చేసేస్తున్నారా?

రష్మికను డమ్మీని చేసేస్తున్నారా?

‘ఛలో’ అనే చిన్న సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రష్మిక మందన్నా. ఆ తర్వాత ఆమెకు మీడియం రేంజి సినిమాలు తగిలాయి. ‘గీత గోవిందం’, ‘దేవదాస్’, ‘డియర్ కామ్రేడ్’ లాంటి చిత్రాల్లో నటించింది. ‘డియర్ కామ్రేడ్’ కంటే ముందు సక్సెస్ రేట్ బాగుండటంతో ఆమెను పెద్ద సినిమాలకు కూడా కన్సిడర్ చేయడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో అవకాశమిచ్చారు. ఐతే ఇది ఫక్తు కమర్షియల్ సినిమా. మహేష్ బాబును ఎలివేట్ చేయడం మీదే దర్శకుడు అనిల్ రావిపూడి దృష్టిసారిస్తాడనడంలో సందేహం లేదు. ఇలాంటి చిత్రంలో కథానాయికకు ఏమాత్రం ప్రాధాన్యం ఉంటుందో అన్న సందేహాలున్నాయి.

దీనికి తోడు రష్మిక పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్ అయితేనే హైలైట్ అవుతుంది. గ్లామర్ విషయంలో ఆమెది వెనుకంజే. అందుకేనో ఏమో.. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్స్‌ కోసం గ్లామర్ హీరోయిన్లను తీసుకునే ప్రయత్నంలో పడ్డాడు అనిల్. ఆల్రెడీ ఒక పాట కోసం తమన్నాను ఓకే చేశాడు. ఈ సినిమాలో తనో బ్లాక్ బస్టర్ సాంగ్ చేస్తున్నట్లు తమన్నా స్వయంగా చెప్పింది. మరో పాటలో పూజా హెగ్డే తళుక్కుమంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమె కూడా ఉందంటే.. ఇక రష్మిక పూర్తిగా డమ్మీ అయిపోవడం ఖాయం. అసలే తనకు సూటవ్వని కమర్షియల్ సినిమా, పైగా ఇద్దరు గ్లామర్ క్వీన్స్ పాటలు చేస్తుంటే.. ఇక సినిమాలో రష్మిక ఎక్కడ కనిపిస్తుంది? సూపర్ స్టార్ పక్కన సినిమా చేస్తున్నాననే ఆమె ఉత్సాహం నీరుగారిపోవడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English