చిరుకు త్రివిక్ర‌మ్ లైన్ చెప్పేశాడ‌ట‌

చిరుకు త్రివిక్ర‌మ్ లైన్ చెప్పేశాడ‌ట‌

సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వ‌డానికి చాలా ఎక్కువ స‌మ‌య‌మే తీసుకున్నాడు కానీ.. అడుగు పెట్టాక మాత్రం ఆగ‌ట్లేదు మెగాస్టార్ చిరంజీవి. ఖైదీ నంబ‌ర్ 150 పూర్త‌య్యే ద‌శ‌లోనే సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రాన్ని లైన్లో పెట్టిన చిరు.. ఆ సినిమా పూర్తి కాక‌ముందే ఒక‌టికి రెండు సినిమాల‌కు క‌మిట‌య్యాడు. అందులో కొర‌టాల శివ సినిమా ప‌క్కా అని ముందే తేలిపోయింది. ఆ సినిమా గురించి అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. ఇంకో నెల రోజుల్లో షూటింగ్ కూడా మొద‌లు కాబోతోంది. దీని త‌ర్వాత త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌నున్న‌ట్లు గ‌తంలో ఒక వేడుక‌లో చూచాయిగా చెప్పాడు చిరు. కానీ అది ప‌క్కాగా ఉంటుందా లేదా అన్న సందేహాలు ఉన్నాయి జ‌నాల్లో.

ఐతే సైరా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా చిరు..త్రివిక్ర‌మ్ సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు. అత‌డితో సినిమా ప‌క్కాగా ఉంటుంద‌న్నాడు. త్రివిక్ర‌మ్ త‌న‌కు లైన్ కూడా చెప్పిన‌ట్లు చిరు వెల్ల‌డించ‌డం విశేషం. త్రివిక్ర‌మ్‌తో తాను చేయ‌బోయే సినిమా 100% కామెడీ ఉండే పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని.. త‌న‌కు చెప్పిన లైన్ మీద త్రివిక్రమ్ వ‌ర్క్ చేస్తున్నాడ‌ని చిరు తెలిపాడు. ఇక కొర‌టాల సినిమా గురించి చిరు చెబుతూ.. అత‌డి గ‌త సినిమాల త‌ర‌హాలోనే ఇది కూడా సామాజిక ప్ర‌యోజ‌నం ఉన్న క‌థ‌తో తెర‌కెక్కుతున్న‌ట్లు తెలిపాడు. అక్టోబ‌రులో ఈ చిత్ర‌ ప్రారంభోత్స‌వం జ‌రిపి, న‌వంబ‌రులో షూటింగ్ మొద‌లు పెడ‌తామ‌ని చిరు వెల్ల‌డించాడు. ఈ సినిమా క‌థానాయిక‌ల గురించి జ‌రుగుతున్న ప్ర‌చారాలేవీ నిజం కాద‌ని, .పూజా కార్య‌క్ర‌మం జ‌రిగే వ‌ర‌కు ఎదురు చూడాల‌ని చిరు అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English