ఎన్టీఆర్‌తో బాలకృష్ణ సెంటిమెంట్‌ పోయినట్టే

ఎన్టీఆర్‌తో బాలకృష్ణ సెంటిమెంట్‌ పోయినట్టే

సంక్రాంతికి బాలకృష్ణ పేరిట చాలా బ్లాక్‌బస్టర్‌ సినిమాలు వచ్చాయి కానీ అదే సమయంలో ఆ సీజన్‌లో ఆయనకి భారీ ఫ్లాప్‌లు కూడా చాలానే వున్నాయి. ఎన్టీఆర్‌ బయోపిక్‌ మొదటి భాగం సంక్రాంతికే రిలీజ్‌ అయి డిజాస్టర్‌ అయింది. బాలకృష్ణ నమ్మకం సడలిపోయేలా దారుణమయిన పరాజయం చవిచూసిన ఎన్టీఆర్‌ ఫలితం తర్వాత ఆయనకి ఇప్పుడు సంక్రాంతి సెంటిమెంట్‌ మీద ఇష్టంగా లేదట.

గతంలో తన సినిమా ఎప్పుడు మొదలయినా సంక్రాంతికే విడుదల చేయాలంటూ దర్శకులపై ఒత్తిడి తెచ్చేవాడు. గౌతమిపుత్ర లాంటి భారీ చిత్రానికి కూడా సంక్రాంతి సెంటిమెంట్‌ పేరుతో క్రిష్‌కి తగినంత సమయం ఇవ్వలేదు. అలాగే ఎన్టీఆర్‌ బయోపిక్‌ని కూడా రెండు భాగాలు చేసి ఒక భాగాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని పట్టుబట్టడంతో క్రిష్‌ అప్పుడు కూడా ఇబ్బంది పడ్డాడు.

అయితే రిలీజ్‌ డేట్‌ వల్ల ఏ ప్రయోజనం వుండదని రియలైజ్‌ అయిన బాలకృష్ణ తన తదుపరి చిత్రానికి సంక్రాంతి కావాలని అడగడం లేదు. డిసెంబర్‌లో విడుదల చేసినా, ఫిబ్రవరిలో వచ్చినా ఫర్వాలేదని చెప్పేసాడు. దీంతో దర్శకుడు కె.ఎస్‌. రవికుమార్‌ ఎలాంటి ఒత్తిడి లేకుండా సినిమా తీసుకుంటున్నాడు. అలాగే సంక్రాంతికి వస్తే థియేటర్లు దొరుకుతాయో లేదోననే బెంగ నిర్మాతకి కూడా లేదిప్పుడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English