తమన్‌‌ను తిట్టిన నోళ్లతోనే పొగడ్తలు

తమన్‌‌ను తిట్టిన నోళ్లతోనే పొగడ్తలు

కెరీర్ ఆరంభంలో క్రియేటివిటీ చూపించి.. ఏళ్లు గడిచేకొద్దీ రొటీన్ మూసలో కొట్టుకుపోయే సంగీత దర్శకుల్నే చూస్తుంటాం మామూలుగా. పెద్ద పెద్ద దిగ్గజాలు కూడా ఇలా కాల క్రమంలో ఫాం కోల్పోయిన వాళ్లే. రాను రాను ఔట్ పుట్ పడిపోతుంటుంది తప్పితే.. మెరుగుపడటం అరుదు. గత రెండు మూడు దశాబ్దాల్లో అగ్రశ్రేణి సంగీత దర్శకుల పనితీరు దాదాపుగా ఇలాగే కనిపిస్తుంది. వివిధ కాలాల్లో నంబర్ వన్ సంగీత దర్శకులుగా ఉన్న కీరవాణి, మణిశర్మ, దేవిశ్రీ ప్రసాాద్.. వీళ్లందరూ కూడా బ్రేక్ అందుకున్నాక ఒక దశాబ్దం పాటు ఆధిపత్యం చలాయించారు. కానీ తర్వాతి కాలాల్లో ఫాం కోల్పోయారు. వీరిలో దేవిశ్రీది కొంచెం లాంగ్ రన్‌యే. కానీ చివరికి అతను కూడా తన స్థాయిని నిలబెట్టుకోలేకపోయాడు. రొటీన్ మ్యూజిక్‌తో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఇప్పుడు విమర్శలెదుర్కొంటున్నాడు.

ఐతే ఎప్పుడూ అగ్రస్థానాన్ని అందుకోకపోయినా.. టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడిగా ఉన్న తమన్ మాత్రం ఇందుకు భిన్నం. అతను ఎంత పెద్ద సినిమాలు చేసినా.. ఎన్ని హిట్లు కొట్టినా.. రొటీన్ మ్యూజిక్ ఇస్తాడనే విమర్శలు ఎప్పుడూ ఉన్నాయి. కాపీ మ్యూజిక్ డైరెక్టర్ అంటూ అతడిపై ఎన్ని ట్రోల్స్ పడ్డాయో కూడా తెలిసిందే. ఐతే కెరీర్లో ఏడెనిమిదేళ్ల పాటు విమర్శలు ఎదుర్కొన్న తమన్.. ఇప్పుడు తనను తాను రీఇన్వెంట్ చేసుకుంటూ తిట్టిన నోళ్లతోనే ప్రశంసలు అందుకుంటుండటం విశేషం. డప్పు కొట్టే మ్యూజిక్ డైరెక్టర్ అంటూ ఒకప్పుడు సంగీత ప్రియులు అతడిని తక్కువ చేసి మాట్లాడేవాళ్లు. క్లాస్ పాటలు, మెలోడీలు ఇవ్వలేడని.. సంగీతం కొత్తదనం ఉండదని తిట్టేవాళ్లు.

కానీ ఇప్పుడు అతడిపై అభిప్రాయాలు మారిపోతున్నాయి. ‘తొలి ప్రేమ’, ‘మహానుభావుడు’, ‘అరవింద సమేత’ లాంటి సినిమాల్లో తమన్ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. ఇప్పుడు ‘అల వైకుంఠపురములో’ సినిమాతో మరోసారి మ్యాజిక్ చేయడానికి రెడీ అయ్యాడు. ఇందులోంచి రిలీజ్ చేసిన తొలి పాట ‘సామజవరగమన’ ఇన్‌స్టంట్ హిట్ అయిపోయింది. సంగీతంలో మంచి అభిరుచి ఉన్నవాళ్లంతా ఈ పాటను తెగ పొగిడేస్తున్నారు. పాట విని పులకింతకు గురవుతున్నారు. తమన్‌లో ఇంత విషయం ఉందా అనుకుంటున్నారు. మొత్తానికి కెరీర్ ఆరంభించిన దశాబ్దం తర్వాత తమన్ మనసు పెట్టి ఇలాంటి మంచి పాటలు అందిస్తూ ప్రశంసలు అందుకుంటుండటం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English