రాంగ్‌ స్టెప్స్‌ వేస్తోన్న పూజ హెగ్డే

రాంగ్‌ స్టెప్స్‌ వేస్తోన్న పూజ హెగ్డే

పూజ హెగ్డేకి ఇప్పుడు తెలుగునాట వున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఆమె చేసిన పావుగంట పాత్ర వల్ల 'గద్దలకొండ గణేష్‌' బతికి బట్టకట్టింది. ఆ పాత్ర, ఆమె పాట లేకపోతే ఆ చిత్రం ఫలితం మరోలా వుండేది. కుర్రకారులో చాలా క్రేజ్‌ సంపాదించిన పూజకి ఇప్పుడు తెలుగు చిత్ర నిర్మాతలు అచ్చంగా పూజ చేస్తున్నారు. ఆమెకి భారీ పారితోషికం ఇస్తూ డేట్లు ఇస్తే చాలనుకుంటున్నారు. తెలుగునాట ఇంత క్రేజ్‌ వుంటే పూజ బాలీవుడ్‌ మోజులో పడి టైమ్‌ వేస్ట్‌ చేస్తోంది.

పోనీ హిందీ చిత్ర సీమ ఆమెకి తగిన న్యాయం చేస్తోందా అంటే అదీ లేదు. హౌస్‌ఫుల్‌ 4 ట్రెయిలర్‌లో పూజకి అస్సలు ప్రాధాన్యత లేదు. ముగ్గురు హీరోయిన్లలోను క్రితి సనన్‌కి ఎక్కువ వెయిట్‌ ఇచ్చారు. కృతి కర్బాందాకి ఎంత సీన్‌ వుందో పూజకి కూడా అంత సీనే ఇచ్చారు. ఇలాంటి చిత్రాలు చేయడం వల్ల హిందీ చిత్ర సీమలో పూజకి ఏమాత్రం అడ్వాంటేజ్‌ అవదు.

నిజంగా నటిగా తనకి పేరు తెచ్చిపెట్టే పాత్రలు చేస్తే చేయవచ్చు కానీ ఇలా గుంపులో గోవిందా పాత్రలు చేసి బాలీవుడ్‌లో అవకాశాలొస్తున్నాయని సంతృప్తి పడకూడదు. గతంలో ఇలాగే బాలీవుడ్‌ మోజులో పడి ఇక్కడ వున్న క్రేజ్‌ని చాలా మంది చెడగొట్టుకున్నారు. పూజ అలాంటి మిస్టేక్‌ చేయకుండా తెలుగుకే స్టిక్‌ ఆన్‌ అయితే బెటరు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English