నాడు వైరం... నేడు స్నేహం..!

నాడు వైరం... నేడు స్నేహం..!

ఆ ఇద్ద‌రూ ఒకే జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేత‌లు.. వీరిమ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గ‌మంటుంది. మొద‌ట్లో ఒకే పార్టీలో క‌లిసి ప‌ని చేసిన‌ప్ప‌టికీ, మారిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో రాజ‌కీయంగా బ‌ద్ధ శ‌త్రువులుగా మారారు. స‌మ‌యం, సంద‌ర్భంగా వ‌స్తే.. ఒక‌రిపై ఒక‌రు ఒంటికాలిపై లేచి, క‌య్యానికి కాలు దువ్వుతారు. అయితే ఇదంతా గ‌తం ... ఇప్పుడు ప‌రిస్థితి మారింది. దాదాపు ప‌ద్నాలుగేళ్ల త‌ర్వాత వారిద్ద‌రి మ‌ధ్య మాట‌లు క‌లిశాయి. దీంతో తెలంగాణ రా జ‌కీయాల్లోనే ఒక ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటుచేసుకున్నట్ల‌యింది.

టీఆర్ ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు, రాష్ట్ర‌మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావుతో అదేజిల్లాకు చెందిన సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జ‌య‌ప్ర‌కాశ్‌రెడ్డికి మ‌ధ్య సుదీర్ఘ కాలంలో రాజ‌కీయ వైరం ఉంది. వా రిద్ద‌రి మ‌ధ్య ప‌ద్నాలుగేళ్లుగా ప‌ల‌క‌రింపులు లేవు. అసెంబ్లీ మొద‌లుకుని , జిల్లా ప‌రిష‌త్ స‌మావేశాల వ‌ర‌కు ప‌ర‌స్ప‌రం ఎదురైనా క‌నీసం ఒక‌రినొక‌రు క‌న్నెత్తి చూసుకోలేదు. అయితే ఈ ఇద్ద‌రు నేత‌లు ఇటీవ‌ల అసెంబ్లీ హాల్‌లో క‌లుసుకోవ‌డం, అర‌గంట పాటు ముచ్చ‌టించ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

2004లో వీరిద్ద‌రు టీఆర్ఎస్ నుంచే ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఆ త‌ర్వాత జ‌గ్గారెడ్డి టీఆర్ఎస్ రెబ‌ల్‌గా మారిపోయారు. వైఎస్ అండ‌తో ఆయ‌న 2009 ఎన్నిక‌ల‌కు ముందే కాంగ్రెస్‌లోకి జంప్ చేసి ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఓడినా 2018 ఎన్నిక‌ల్లో మ‌రోసారి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు.
ఇదిలా ఉంటే తాజాగా గురువారం సంగారెడ్డి జిల్లా ప‌రిష‌త్ స‌మావేశంలో మ‌రో అరుదైన‌, ఆస‌క్తిక‌రమైన స‌న్నివేశం చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి, రాష్ట్ర మంత్రి హ‌రీశ్‌రావును స‌న్మానించి, అక్క‌డున వారంద‌రినీ ఆశ్చ‌ర్చానికి గురిచేశారు.

ఎమ్మెల్యే .. హ‌రీశ్‌రావుకు శాలువా క‌ప్పి, పుష్ప‌గుచ్ఛం అంద‌జేసి స‌త్క‌రిండంతో అటు కాంగ్రెస్‌, ఇటు టీఆర్ఎస్ పార్టీ వ‌ర్గాల‌ను విస్మ‌యానికి గురిచేసింది. ఈసంద‌ర్భంగా జ‌గ్గారెడ్డి మ‌రోసారి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని మంత్రి హ‌రీశ్‌రావును కోర‌డం... ఆయ‌న సానుకూలంగా  స్పందించ‌డంతో అక్క‌డున్న‌వారంతా ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. అస‌లు జ‌గ్గారెడ్డిలో క‌లిగిన ఈ అనూహ్య మార్పున‌కు కార‌ణ‌మేంట‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో ర‌క‌ర‌కాలు చ‌ర్చ జ‌రుగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English