ఆ రెండు రాష్ట్రాల్లో 'సాహో' సంచలనం

ఆ రెండు రాష్ట్రాల్లో 'సాహో' సంచలనం

ఈ ఏడాది ఇండియాలో విడుదలైన అతి పెద్ద సినిమా అంటే 'సాహో'నే. బడ్జెట్, బిజినెస్, వసూళ్లు.. ఇలా ఏ రకంగా చూసినా ఈ సినిమానే అగ్రస్థానంలో నిలుస్తుంది. త్వరలో విడుదల కాబోతున్న 'సైరా నరసింహారెడ్డి' కూడా దాన్ని అధిగమించగలదా అన్నది సందేహమే. ఐతే విచారకరమైన విషయం ఏంటంటే.. ఈ ఏడాది అతి పెద్ద డిజాస్టర్‌గా కూడా 'సాహో'నే నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బయ్యర్లకు దాదాపు రూ.80 కోట్ల దాకా ఈ చిత్రం నష్టాలు మిగిల్చినట్లు అంచనా.

నార్త్ ఇండియాలో మినహా అన్ని చోట్లా ఆ సినిమా భారీ నష్టాలు మిగిల్చింది. హిందీ వెర్షన్ రూ.150 కోట్ల  వసూళ్లతో ఆ సినిమాను రిలీజ్ చేసిన వారికి, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఈ హాలీవుడ్ స్టైల్ యాక్షన్ థ్రిల్లర్‌ను నార్త్‌లోని రూరల్ ఏరియాస్‌లో జనాలు ఎగబడి చూడటం ఆశ్చర్యకర విషయమే.

బీహార్, ఒరిస్సా రాష్ట్రాల్లో 'సాహో' రికార్డు స్థాయి వసూళ్లు సాధించడం అక్కడి ట్రేడ్ పండితుల్ని ఆశ్చర్యపరిచింది. హిందీలో ఒరిస్సా రాష్ట్రంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో సినిమాగా 'సాహో' నిలవడం విశేషం. అగ్రస్థానంలో ఉన్నది 'బాహుబలి: ది కంక్లూజన్' కావడం మరో విశేషం. ఇక బీహార్లో ఎన్నో పెద్ద హిందీ సినిమాల్ని వెనక్కి నెట్టి అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో ఆరో స్థానం సాధించింది 'సాహో'.

భజరంగి భాయిజాన్, సింబా, సుల్తాన్, పీకే లాంటి భారీ చిత్రాల వసూళ్లను 'సాహో' దాటేసింది. ఒరిస్సాలో రూ.5 కోట్లకు పైగా, బీహార్లో రూ.9 కోట్ల దాకా 'సాహో' కలెక్ట్ చేసింది. చిన్న రాష్ట్రాలు, థియేటర్లు తక్కువ ఉన్న ఈ ప్రాంతాల్లో ఆ వసూళ్లు చాలా ఎక్కువే. హిందీలో 'బాహుబలి', '2.0' తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా కూడా 'సాహో' రికార్డు నెలకొల్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English