ఆరు వందల ఏళ్లు వెనక్కెళ్లిపోయిన సూపర్ స్టార్

ఆరు వందల ఏళ్లు వెనక్కెళ్లిపోయిన సూపర్ స్టార్

బాలీవుడ్లో ఇప్పుడు వార్షిక ఆదాయం, సినిమాల క్వాలిటీ, ఫ్రీక్వెన్సీ ప్రకారం చూస్తే నంబర్ వన్ హీరో ఆమిర్ ఖాన్ కాదు, సల్మాన్ ఖాన్ కాదు.. అక్షయ్ కుమారే. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండానే  ఏడాదికి రెండు మూడు రిలీజ్‌లు ఉండేలా చూసుకుంటున్న అక్షయ్ వరుస హిట్లతో దూసుకెళ్లిపోతున్నాడు. ఈ ఏడాది ‘కేసరి’, ‘మిషన్ మంగళ్’ లాంటి సూపర్ హిట్లు అందించాడు అక్షయ్.

ఇప్పుడతను నటిస్తున్న కొత్త చిత్రం ‘హౌస్ ఫుల్-4’. ఈ సిరీస్‌లో ఇప్పటిదాకా వచ్చిన మూడు సినిమాలూ సూపర్ హిట్టయ్యాయి. కొత్త సినిమా కూడా ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించి కలెక్షన్ల మోత మోగిస్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి దాని ఫస్ట్ లుక్ పోస్టర్, కాన్సెప్ట్ చూస్తే. కామెడీ సినిమాల రైటర్‌గా మంచి పేరు సంపాదించి.. ఆ తర్వాత దర్శకుడిగా మారిన ఫర్హద్ సామ్‌జీ దర్శకత్వంలో సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్న ‘హౌస్ ఫుల్-4’ ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ రోజే రిలీజైంది.

ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ రెండు విభిన్నమైన పాత్రలు చేస్తున్నాడు. అందులో ఒకటి 600 ఏళ్ల కిందటి పాత్ర కావడం విశేషం. ఆ పాత్ర పేరు బాలా. దీని కోసం గుండు చేయించుకుని, పొడవాటి మీసంతో సరికొత్తగా దర్శనమిస్తున్నాడు అక్షయ్. గత ఏడాది అక్షయ్ గుండుతో కనిపించిన సంగతి తెలిసిందే. అది క్యాజువల్‌గా చేయించుకున్న గుండు కాదని.. ఈ సినిమా కోసమే అని ఇప్పుడు అర్థమవుతోంది.

‘హౌస్ ఫుల్-4’ కథ కొంత మేర 14వ శతాబ్దంలో నడుస్తుందట. పునర్జన్మల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నాటి పాత్రలు.. ఇప్పటి వాళ్ల అవతారాల్ని వేధించుకునే తినే కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తోంది. హౌస్ ఫుల్ సిరీస్ ‌సినిమాలంటేనే కామెడీకి పెట్టింది పేరు. విపరీతమైన అల్లరి ఉంటుంది. కొత్త సినిమా తొలి మూడు చిత్రాల్ని మించి వినోదం పంచేలాగే ఉంది. ఇందులో రితీశ్ దేశ్‌ముఖ్, అర్జున్ రాంపాల్, కృతి కర్బందా, పూజా హెగ్డే తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబరు 27న ‘హౌస్ ఫుల్-4’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English