పూరి-బన్నీ క్రేజ్‌ను తొక్కేస్తున్నారు

పూరి-బన్నీ క్రేజ్‌ను తొక్కేస్తున్నారు

సినిమావోళ్ల మాటలకి, ఎక్స్‌ప్రెషన్స్‌కి అర్థాలేంటో కనిపెట్టడం కాస్త కష్టమైన వ్యవహారమే! ఓ వైపు సినిమా రిలీజవుతున్నా...‘మాటల్లేవ్‌..మాట్లాడుకోడాల్లేవ్‌’ అంటూ..కలరింగేస్తూ అసలు విషయాన్ని దాటవేయడం వెనుక ఉన్న మర్మమేమిటో  బుర్ర పీక్కోవడం తప్ప వినేవాడికేం అర్థంకానేలేదు. కనీసం రిలీజ్‌ ముందు రోజైనా హైప్‌ కోసం ఆ సినిమా దర్శకుడు, హీరో..ఏవైనా మాట్లాడుతారనుకుంటే..అదీ లేదు. ఇదంతా ‘ఇద్దరమ్మాయిలతో’ తీసిన దేశముదుర్ల గురించే. నిన్నటి ఆడియో హెక్సాప్లాటినం వేడుకలోనూ ఆ ఇద్దరిదీ అదే తంతు. సినిమాలో అస్సలు ఏ విషయం లేకపోతే..దాచేయాలి. లేదా పెద్ద బ్లాక్‌బస్టర్‌ అవుతుందన్న ఓవర్‌ కాన్ఫిడెన్సులోనైనా ఇలా బిహేవ్‌ చేయాలి...ఈ సంగతిని జనం పబ్లిగ్గానే అడిగేస్తున్నారు.

అసలా సినిమా రిలీజ్‌ తేదీ కూడా నిర్మాతకి తెలీకుండా తొక్కేసిన సదరు దర్శకహీరోలు, సినిమా విశేషాల్నీ బైటికి రాకుండా తొక్కేశారు. అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న సినిమా సంగతులేవీ బైటికి రాకుండా దాచేశారు. దీనిలో ఉన్న మర్మం, అంతర్యమేమిటో పూరి, బన్నికే తెలియాలి. ‘ఇద్దరమ్మాయిలతో’ హిట్టా?ప్లాపా? తేలేందుకు ఇంకొన్నిగంటలే వుంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు