ఆడియన్స్‌ ఉండాలా.. ఆవిరైపోవాలా?

ఆడియన్స్‌ ఉండాలా.. ఆవిరైపోవాలా?

ఏదైనా ఒక సినిమాలో ఒక ఐటెమ్‌ సాంగ్‌ పెడితే మాస్‌ ఆడియన్స్‌ని, ప్రత్యేకించి మగాళ్లని శాటిస్‌ఫై చేయడానికే అనేది జగమెరిగిన సత్యం. ఐటెమ్‌ సాంగ్‌ కోసమైనా వాళ్లు రిపీట్స్‌ వేస్తారని డైరెక్టర్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. అందుకే చాలా సినిమాల్లో ఐటెమ్‌ సాంగ్స్‌ మస్ట్‌ అయిపోతున్నాయి. అయితే త్వరలో విడుదల కానున్న ఓ సినిమాలో ఏకంగా మూడు ఐటెమ్‌ సాంగ్స్‌ పెట్టేశారు. అన్నిట్లోను హాట్‌ గాల్స్‌ని తీసుకున్నారు. 

ప్రియాంక చోప్రా ఈ సినిమాలో ఓ ఐటెమ్‌ సాంగ్‌ చేసింది. ఆమె చాలదన్నట్టు సన్నీలియోన్‌తో కూడా ఒక సాంగ్‌ చేయించారు. సన్నీ లియోన్‌ ఐటెమ్‌ సాంగ్‌ అంటే అది ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. సన్నీ కూడా సరిపోదన్నట్టు సోఫీ చౌదరితో మరో ఐటెమ్‌ సాంగ్‌ పెట్టారు. మిగతా ఇద్దరినీ మరిపించి మెప్పించాలంటే తనకి చాలా కష్టమని అనుకుందో ఏమో సోఫీ అయితే ఒంటి మీద బట్టలే సరిగా వేసుకోలేదు. దాదాపు బికినీలాంటి డ్రెస్‌ ఒకటి వేసుకుని రెడ్‌ హాట్‌గా కనిపిస్తోంది. ఒక్క ఐటెమ్‌ సాంగ్‌కే వేడి పుడితే ఒక మూడు మహా హాట్‌ ఐటెమ్స్‌తో ఇక 'షూటవుట్‌ ఎట్‌ వడాలా' సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఆవిరైపోతారేమో కూడా!

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు