చరణ్‌ హోల్‌సేల్‌గా అమ్మట్లేదు

చరణ్‌ హోల్‌సేల్‌గా అమ్మట్లేదు

సైరా చిత్రానికి తెలుగునాట వచ్చిన బిజినెస్‌ ఆఫర్లు మిగతా చోట్ల రాలేదు. హిందీలో ఈ చిత్రాన్ని చాలా తక్కువ మొత్తానికే తీసుకున్నారు. అయితే ఎక్సెల్‌ సంస్థకి చరణ్‌ హోల్‌సేల్‌గా రైట్స్‌ రాసిచ్చేయలేదు. మినిమం గ్యారెంటీ పద్ధతిలోనే హిందీ రైట్స్‌ ఇచ్చాడు. హిందీలో ఎంత వస్తుందనేది చెప్పడం కష్టం కాబట్టి, దీనికున్న క్రేజ్‌ అంచనా వేయలేరు కాబట్టి చరణ్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

తద్వారా హిందీలో బాగా లాభాలు వస్తే కొన్నవారికే మొత్తం వెళ్లిపోకుండా తనకీ యాభై శాతం వాటా వచ్చేలా చూసుకున్నాడు. చరణ్‌కి హిందీలో స్వయంగా విడుదల చేయాలని వున్నా కానీ నార్త్‌ మార్కెట్‌పై అసలు గ్రిప్‌ లేకుండా ఏమి చేయడమైనా కష్టమే. అందుకే అనుభవజ్ఞుల చేతికి ఈ చిత్రాన్ని ఇచ్చి చరణ్‌ సేఫ్‌గా గేమ్‌ ఆడుతున్నాడు.

ఈ చిత్రాన్ని అవుట్‌రైట్‌గా కొనడానికి ఇంకా పెద్ద సంస్థలే ముందుకొచ్చినా కానీ లాభాలు బాగా వచ్చిన పక్షంలో తప్పు చేసినట్టు అవుతుందని చరణ్‌ ఇలా నిర్ణయించుకున్నాడు. ఎక్సెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా ఈ చిత్రాన్ని లైట్‌ తీసుకోవడం లేదు. నార్త్‌ ఇండియాలో ఈ చిత్రాన్ని పదిహేను వందల స్క్రీన్లలో విడుదల చేస్తూ తమ క్రెడిబులిటీ చాటుకుంటున్నారు. వార్‌ లాంటి భారీ చిత్రంతో క్లాష్‌ వున్నా కానీ ఇన్ని థియేటర్లు పట్టారంటే మాటలు కాదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English