వాల్మీకి డైలాగ్ చదివి చిరంజీవి గుర్తుకొచ్చి..

వాల్మీకి డైలాగ్ చదివి చిరంజీవి గుర్తుకొచ్చి..

దర్శకుడు హరీష్ శంకర్‌ది డైలాగులు రాయడంలో ప్రత్యేక నైపుణ్యం. స్వతహాగా భాష మీద మంచి పట్టున్నవాడు. సాహిత్యాభిలాష బాగానే ఉంది. మనిషి మంచి చమత్కారి. దీంతో అతడి సినిమాల్లో డైలాగులు భలేగా పేలుతుంటాయి. ఫలితాలతో సంబంధం లేకుండా డైలాగుల విషయంలో మాత్రం హరీష్‌కు మంచి పేరొస్తుంటుంది. అతడి తాజా సినిమా ‘వాల్మీకి’లోనూ డైలాగులు భలేగా పేలాయి.

గద్దలకొండ గణేష్ పాత్ర నోటి నుంచి అనేక ఆణిముత్యాలు పేలాయి. ఇక సినిమా చివర్లో ‘సినిమా’ గురించి పలికే డైలాగులైతే ప్రతి ప్రేక్షకుడిలోనూ ఉద్వేగం కలిగిస్తాయి. ఇక సినిమా వాళ్ల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. హరీష్ చాలా ఫీలై రాసినట్లుండే ఈ డైలాగులకు హీరో వరుణ్ తేజ్ సైతం ఫిదా అయిపోయాడట. ఉద్వేగం తెచ్చుకున్నాడట.

సినిమా డబ్బు ఇస్తుందని తెలుసు.. పేరు తెస్తుందని తెలుసు.. కానీ ఇంత ప్రేమను కూడా ఇస్తుందా అని ఉంటుందా డైలాగ్. కారవాన్లో కూర్చుని ఈ డైలాగ్ చదవగానే.. నిజమే కదా సినిమా వల్ల తనకు ఇంత ప్రేమ దక్కిందే అనుకున్నాడట వరుణ్. ఆ సమయంలో అతడికి తన పెదనాన్న చిరంజీవే గుర్తుకొచ్చాడట. తాను సినిమాల్లోకి వచ్చి హీరో అయ్యానంటే అది కేవలం చిరంజీవి వల్ల మాత్రమే అని గుర్తు చేసుకుని వెంటనే చాలా ఎమోషనల్‌గా చిరుకు ఒక పెద్ద మెసేజ్ పెట్టాడట వరుణ్.

చిరు తన పాటికి తాను కష్టపడి సినిమాల్లో నిలదొక్కుకున్నాడని.. ఆయన పేరు చెప్పుకుని తామందరం సినిమాల్లోకి వచ్చి ఇప్పుడు ప్రేక్షకుల ప్రేమను పొందగలుగుతున్నామని.. అందుకే ఎమోషనల్ ‌అయి ‘డ్యాడీ చాలా థ్యాంక్స్’ అంటూ ఆయన మెసేజ్ పెట్టానని వరుణ్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English