పొరుగింటి పుల్లకూరని పక్కన పెట్టేసారు

పొరుగింటి పుల్లకూరని పక్కన పెట్టేసారు

తెలుగు చిత్రాలతో సమానంగా అనువాద చిత్రాలని చూసేందుకు ఎగబడే అలవాటున్న తెలుగు ప్రేక్షకులు గత కొన్ని సంవత్సరాలుగా తమిళ అనువాద చిత్రాలని చూడడం తగ్గించేసారు. తోపు హీరోలుగా చెప్పబడే రజనీకాంత్‌ లాంటి వారికి కూడా ఇక్కడ తిరస్కారం తప్పట్లేదు. సూర్య, విక్రమ్‌ అయితే పూర్తిగా తెలుగు మార్కెట్‌ కోల్పోయారు. ఈమధ్య కాలంలో లారెన్స్‌ 'కాంచన' చిత్రాలు మినహా తెలుగులో బాగా ఆడిన తమిళ చిత్రాలేమీ లేవు.

ఒకప్పుడు ముప్పయ్‌, నలభై కోట్లు పలికిన రజనీకాంత్‌ చిత్రాలకి ఇప్పుడు పది కోట్లు కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేరు. సూర్య మార్కెట్‌ అయితే సగానికి పైగానే పడిపోయింది. అయిదు కోట్లకి అనువాద హక్కులు తీసుకున్నా కానీ వర్కవుట్‌ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే తమిళ అనువాద చిత్రాల సంఖ్య గణనీయంగా తగ్గిపోగా, మున్ముందు కాలంలో అసలు పూర్తిగా కనుమరుగయ్యేలా వున్నాయి.

దీనికి తమిళ వాళ్లు తీస్తోన్న హోప్‌లెస్‌ చిత్రాలే కారణం అనుకోవడానికి లేదు. తెలుగు సినిమాల క్వాలిటీ పెరగడం, కంటెంట్‌ పరంగా తెలుగులోనే చాలా వెరైటీ వుండడంతో ఇక తమిళ చిత్రాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి లేదు. అదే సమయంలో తమిళ చిత్రాల్లో కూడా కంటెంట్‌ రాన్రానూ వీక్‌ అవుతోంది. అక్కడ కూడా వెరైటీ చిన్న చిత్రాలకే పరిమితం అవుతోంది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English