ఇలాంటి టైంలో హ్యాండిస్తే ఎలా అమితాబ్ జీ

ఇలాంటి టైంలో హ్యాండిస్తే ఎలా అమితాబ్ జీ

‘సైరా నరసింహారెడ్డి’ విడుదలకు ఇంకో పది రోజులే సమయం ఉంది. ఇప్పుడు ప్రమోషన్ల జోరు పెంచాల్సిన అవసరం ఉంది. ఐతే ఇప్పటిదాకా టీజర్, ట్రైలర్ లాంచ్ మినహాయిస్తే ఏ రకమైన హంగామా లేదు. ఇవి రెండే సినిమాలు సాధ్యమైనంతగా పైకి లేపాయి. ముఖ్యంగా ట్రైలర్ ఉత్తరాది ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయినట్లుగా ఉంది.

దానికి భారీ వ్యూస్ రావడమే అందుకు నిదర్శనం. ఈ దశలో బాలీవుడ్లో ప్రమోషన్ల హడావుడి పెంచాల్సి ఉంది. కానీ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన అమితాబ్ బచ్చన్ సరైన సమయంలో హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. ఇటీవల ముంబయిలో జరిగిన టీజర్ లాంచ్ కార్యక్రమానికి అమితాబ్ హాజరు కాలేదు. కేవలం ఆన్ లైన్లో మాత్రమే ‘సైరా’ టీజర్, ట్రైలర్ షేర్ చేశారు అమితాబ్.

ముంబయిలో ఒక పెద్ద ఈవెంట్ చేసి దానికి అమితాబ్‌ను రప్పించి.. ‘సైరా’ గురించి మాట్లాడిస్తే కచ్చితంగా అది సినిమాకు పెద్ద ప్లస్ అవుతుంది. ఉత్తరాదిన సినిమాకు ఓపెనింగ్స్ రావాలంటే ఇది చాలా కీలకం. ఆదివారం రాత్రి జరిగే ‘సైరా’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అమితాబ్ వస్తారని ఆశిస్తున్నారు కానీ.. ఉత్తరాదిన ఆయన ప్రమోషన్లలో పాల్గొనడం కీలకం. ఐతే ‘సైరా’కు ఒప్పుకుని పెద్ద సాయం చేసిన అమితాబ్.. ఈ విషయంలో ఎందుకు సహకరించట్లేదో మరి.

ఆయనకు ఆరోగ్యం బాగోవట్లేదని అంటున్నారు. అది నిజమా.. లేక తానో చిన్న పాత్ర చేసిన తెలుగు సినిమా ప్రమోషన్లలో పాల్గొనాల్సిన అవసరం లేదని ఆయన అనుకుంటున్నారో తెలియదు మరి. తమిళంలో సినిమాను ప్రమోట్ చేయాల్సిన విజయ్ సేతుపతి, నయనతార కూడా సైలెంటుగా ఉన్నారు. నయన్ ఎప్పుడూ ప్రమోషన్లకు రాదన్నది తెలిసిన విషయమే. విజయ్ సేతుపతి కాస్త ఓన్ చేసుకుని ఈ సినిమాను ప్రమోట్ చేయాల్సిన అవసరముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English